Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్

మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ

Octopus and Swat: మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ. తెలంగాణాలోని మావోయిస్టు కార్యకలపాల అణచివేతలో గ్రేహాండ్స్ తో పాటు ఆక్టోపస్ కు అపార అనుభముంది.

2007 ఆగష్టులో జరిగిన హైదరాబాద్ లోని గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ బాంబు పేలుళ్ళ తర్వాత రెండు నెలలకు ఈ ఆక్టోపస్ ఉద్భవించింది. 2012లో ఇబ్రహీంపట్నం సమీపంలోని 570 ఎకరాల ప్రాంగణంలో ఆక్టోపస్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఆక్టోపస్ కమెండోలు గ్లాక్-19 ఫిస్టల్స్, కోల్ట్ 9MM, SMG స్మఫర్ రైఫిల్స్ వంటి అడ్వాన్స్ డ్ వెపన్స్ వాడతారు.

స్వాట్ అంటే స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ అనేది ఢిల్లీ పోలీసులకు చెంన సంస్థ. దేశరాజధానిలో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించటంలో ‘స్వాట్’ కు మంచి గుర్తింపు ఉంది. 26/11 ముంబయి పేలుళ్ళ తర్వాత 2009లో ఢిల్లీలో స్వాట్ను ఏర్పాటు చేశారు. స్వాట్ కమెండోలకు ఆరంభంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ NSG తరహాలో శిక్షణ నిచ్చారు. ఇజ్రాయెల్ మార్షల్ ఆర్ట్స్ క్రాప్ మగాలోనూ వీరు తర్ఫీదు పొందారు.వీరిలో మహిళా కమెండోలూ ఉండటం విశేషం.

ఇప్పుడు ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయబోతున్నాయి. తమ పనితీరును మెరుగుపరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో సాయుధ శిక్షణ, రహస్య సమాచార సేకరణ, ఆపరేషన్ల నిర్వహణ వంటి అంశాల్లో ఈ రెండు దిగ్గజ విభాగాలూ తమ నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోనున్నాయి. తద్వారా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనున్నాయి.

Also Read: Bhuvneshwar Kumar: టీమిండియా జట్టులోకి భువనేశ్వర్?