Delta Force : ఇజ్రాయెల్‌లో అమెరికా ‘డెల్టా ఫోర్స్’ .. ఏం చేయబోతోంది ?

Delta Force: హమాస్ పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి తన డెల్టా ఫోర్స్‌ను అమెరికా రంగంలో దింపింది.

  • Written By:
  • Updated On - October 21, 2023 / 07:41 AM IST

Delta Force: హమాస్ పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి తన డెల్టా ఫోర్స్‌ను అమెరికా రంగంలో దింపింది. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడంతో పాటు గాజా గ్రౌండ్ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ కు సాయం  చేసే లక్ష్యంతో డెల్టా ఫోర్స్ ను అమెరికా పంపింది. ఈ రెండింటిని మించిన మరో టార్గెట్ కూడా ఉంది. అదేమిటంటే.. హమాస్ కు చెందిన టాప్ కమాండర్లను అరెస్ట్ చేయడం. అయితే ఇజ్రాయెల్ కు అమెరికా  పంపిన 2వేల మంది సైనికుల్లో ఎంతమంది డెల్టా  ఫోర్స్ సిబ్బంది ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు. వాస్తవానికి డెల్టా ఫోర్స్ టాప్ కమాండర్లు  ఇజ్రాయెల్ కు బయలుదేరే ముందు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను వైట్ హౌస్‌కు వెళ్లి కలిశారు. వారికి స్వయంగా బైడెన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తొలుత వైట్ హౌస్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఒక ఫొటోలో డెల్టా ఫోర్స్ కమాండర్ల ముఖాలు కనిపించాయి. వార్ ఆపరేషన్లకు పంపే సైనిక కమాండర్ల ముఖాలను ముందుగా రిలీజ్ చేయడం సరికాదనే నిబంధనలు ఉన్నాయి.  కొన్ని గంటల తర్వాత తన తప్పును గ్రహించిన వైట్ హౌస్..  వెంటనే డెల్టా ఫోర్స్ కమాండర్ల ముఖాలను బ్లర్ చేసిన ఫొటోలను పోస్ట్ చేసింది. ముఖాలు కనిపించేలా తొలుత పోస్ట్ చేసిన ఫొటోలను ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ (Delta Force)  చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏమిటీ డెల్టా ఫోర్స్ ? ఏం చేస్తుంది ?

  • డెల్టా ఫోర్స్ ను 1977లో ఏర్పాటు చేశారు. దాని మొదటి కమాండర్ కల్నల్ చార్లెస్ బెక్‌విత్.
  • డెల్టా ఫోర్స్‌ను  అమెరికా ప్రభుత్వం తొలుత 1వ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషనల్ డిటాచ్‌మెంట్ – డెల్టా (1వ SFOD-D) అని పిలిచేది. తర్వాత దీని పేరు ‘కంబాట్  అప్లికేషన్స్ గ్రూప్ (CAG)గా, ఇటీవల ఆర్మీ కంపార్ట్‌మెంట్ ఎలిమెంట్స్ (ACE)గా మారిపోయింది.
  • డెల్టా ఫోర్స్ అనేది అమెరికా స్పెషల్ ఆర్మీ మిషన్స్ యూనిట్‌. దీన్ని ప్రాథమికంగా తీవ్రవాద నిరోధక మిషన్‌‌ల కోసం మోహరిస్తుంటారు.
  • గ్రౌండ్ ఆపరేషన్లు చేయడంలో డెల్టా ఫోర్స్ దిట్ట.  బందీలను రక్షించడంలో,  సీక్రెట్ ఆపరేషన్స్  చేయడంలో ఇందులోని సభ్యులకు ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి.
  • అమెరికాకు చెందిన కీలకమైన  నాయకుల రక్షణ బాధ్యతలను కూడా డెల్టా ఫోర్స్ లోని ఎంపిక చేసి సిిబ్బందికి అప్పగిస్తుంటారు.

డెల్టా ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్లు

ఆపరేషన్ ఈగల్ క్లా : 1980లో ఇరాన్ లో కొందరు సాయుధులు 8 మంది అమెరికన్లను బందీలుగా తీసుకున్నారు. డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగినప్పటికీ.. ఏవియేషన్ పరికరాలు/ఆపరేటర్ లోపం కారణంగా రెస్క్యూ ప్రయత్నం విఫలమైంది. ఎనిమిది మంది అమెరికన్లు చనిపోయారు.

ఆపరేషన్ అర్జెంట్ ఫ్యూరీ : రిచ్‌మండ్ హిల్ జైలు నుంచి గ్రెనడా ఖైదీలను  డెల్టా ఫోర్స్ రక్షించింది.

ఆపరేషన్ జస్ట్ కాజ్: పనామా నియంత మాన్యువల్ నోరీగాను అదుపులోకి తీసుకొని, పనామాలో నివసిస్తున్న దాదాపు 35,000 మంది అమెరికన్లను డెల్టా ఫోర్స్ రక్షించింది.

గల్ఫ్ యుద్ధం: కువైట్‌పై ఇరాక్ దాడి చేసింది. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి సద్దాం హుస్సేన్ సైన్యాన్ని ఓడించి తిరిగి ఇరాక్‌లోకి నెట్టేసింది.

ఆపరేషన్ గోతిక్ సర్పెంట్ :  1993లో మొగదీషులో జరిగిన యుద్ధంలోనూ డెల్టా ఫోర్స్ పాల్గొని స్పెషల్ ఆపరేషన్స్ చేసింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం: 2001 సెప్టెంబరు 11న ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా సైన్యం దాడులు చేసి ఒక నెలలోనే తాలిబాన్లను ఓడించింది.ఈ విజయంలో కీలక పాత్ర డెల్టా ఫోర్స్ దే..

తోరా బోరా యుద్ధం: ఒసామా బిన్ లాడెన్‌ను తోరాబోరా గుహల నుంచి  పట్టుకోవడానికి నిర్వహించిన ఆపరేషన్ ఇది. ఇందులోనూ డెల్టా ఫోర్స్ పాల్గొంది.

ఆపరేషన్ రెడ్ డాన్: సద్దాం హుస్సేన్‌ను గుర్తించి, పట్టుకున్నది కూడా డెల్టా ఫోర్సే.

ఆపరేషన్ జునిపర్ షీల్డ్: 2012లో బెన్‌ఘాజీపై ఉగ్రదాడి  జరిగి సమయంలో.. లిబియాలోని ట్రిపోలీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయడంలో డెల్టా ఫోర్స్ సహాయం చేసింది.

ఆపరేషన్ బ్లాక్ స్వాన్: సినాలోవా కార్టెల్ లీడర్ జోక్విన్ “ఎల్ చాపో” గుజ్మాన్‌ని పట్టుకోవడంలో డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషించింది.

ఆపరేషన్ కైలా ముల్లర్: సిరియాలో ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీని మట్టుబెట్టింది కూడా డెల్టా ఫోర్సే.

Also Read: Petrol Diesel: వాహనదారులకు రిలీఫ్.. పండగకి ముందు ధరలు ఇలా.. మీ ఏరియాలో లీటరు ఎంతంటే..?