Site icon HashtagU Telugu

Non Veg PaniPuri: ఆహా ఏమి రుచి.. తినేద్దామా ‘నాన్ వెజ్’ పానీ పూరీ

Panipuri

Panipuri

ఆహార ప్రియులు కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా మారడంతో కొత్త కొత్త ఆహారపు అలవాట్లు వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. నిత్యం ఒకే రకమైన రుచులకు దూరంగా ఉంటున్నారు. నోరూరించే వెరైటీ రుచుల కోసం ఆసక్తి చూపుతున్నారు. భోజనం లో వెజ్, నాన్ వెజ్ ఉన్నట్టుగా ఇప్పుడు పానిపూరిలో కూడా నాన్ వెజ్ పానీ పూరిలు నోరూరిస్తున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ సరికొత్త పానీపూరీని పరిచయం చేశాడు. ఇందులో చికెన్ పానీపూరీ, మటన్ పానీ పూరీ, రొయ్యల పానీపూరీ, వేట్కీ ఫిష్ పానీపూరీ వెరైటీలు ఉన్నాయి.

దీని మెనూకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సరికొత్త పానీపూరీలపై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. వాట్ ఏన్ ఐడియా సర్జీ అంటూ పలువురు ఆహారప్రియులు ప్రశంసిస్తున్నారు. పిల్లలు, యువత బాగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్ లో పానీపూరీ ఒకటి. రోడ్డు పక్కనున్న బండ్ల దగ్గర లొట్టలేసుకుంటూ అందరూ పానీపూరీని లాగించేస్తుంటారు. అయితే నాన్ వేజ్ పానీ పూరి వైరల్ కావడంతో ఇది ఎలా తయారుచేస్తారు? ఏవిధంగా తయారుచేస్తారు? అంటూ చాలామంది మెనూ కోసం సెర్చ్ చేస్తుండటం విశేషం.

Also Read: Puvvada Comments: సీఎం అయ్యేందుకు కేటీఆర్‌ సిద్ధం: మంత్రి పువ్వాడ