Site icon HashtagU Telugu

FD Rates : కొత్త సంవత్సరం బంపర్ ఆఫర్.. 9.36% వడ్డీ ఇస్తున్న ఫైనాన్స్ కంపెనీ..

Yes Bank

Finance Company Giving 9.36% Interest Fd Rates

వడ్డీ ఎక్కువ వస్తోందంటే ఎవరికి చేదు చెప్పండి. 2023లో భారతీయ ఇన్వెస్టర్లు తమ డబ్బుకు ఎక్కువ రాబడి ఎందులో అందుతుంది అనే విషయాలను వెతికే పనిలో పడ్డారు. అలాంటి వారి కోసం ఇప్పుడు మంచి పెట్టుబడి ఆవకాశం వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త ఏడాది శుభవార్త:

కొత్త సంవత్సరంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది నిజంగా పెద్ద శుభవార్త. దేశంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీగా ఉన్న శ్రీరామ్ గ్రూప్ ఎఫ్‌డిపై మంచి సంపాదన అవకాశాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. కంపెనీ తన FD వడ్డీ రేట్లను భారీగా పెంచింది. శ్రీరామ్ ఫైనాన్స్ FD వడ్డీ రేట్లను 5 నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ నిర్ణయం తర్వాత.. కంపెనీ FDలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు గరిష్ఠంగా 9.36 శాతానికి చేరుకుంది.

FD పై బంపర్ వడ్డీ:

శ్రీరామ్ ఫైనాన్స్‌లో FD చేసిన వారికి బంపర్ వడ్డీ రాబడి అందుబాటులో ఉంది. 2023 ప్రారంభంతో కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి FDపై 9.36 శాతం వరకు వడ్డీ రాబడిని పొందటానికి సదవకాశం అందుబాటులోకి వస్తోంది. అధిక వడ్డీ కావాలనుకునేవారికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎంపికల్లో ఇది కూడా ఒక ఉత్తమమైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. FDపై వడ్డీ పెరుగుదలతో పాటు అన్ని పునరుద్ధరణలపై 0.25 శాతం అదనపు వడ్డీ కూడా అందుబాటులో ఉంటుంది

పెరిగిన రేట్లు ఇలా మహిళలకు

శ్రీరామ్ ఫైనాన్స్ మారిన FD వడ్డీ రేట్ల వివరాలను వెల్లడించింది. అలా 12 నుంచి 60 నెలల వివిధ కాలపరిమితులకు అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను కంపెనీ ప్రకటించింది. వీటిలో సాధారణ కస్టమర్లకు అందిస్తున్న రేట్ల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.50 శాతాన్ని ఫైనాన్స్ సంస్థ చెల్లిస్తోంది. అలాగే మహిళలకు FDపై 0.10 శాతం అదనపు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 12 నెలల పెట్టుబడి కాలానికి 7.30 శాతం వడ్డీని చెల్లిస్తుండగా.. 60 నెలల పెట్టుబడులపై గరిష్ఠంగా 8.45 శాతం చెల్లించేందుకు సిద్ధమైంది.

9.36 శాతం బంపర్ రిటర్న్స్:

శ్రీరామ్ ఫైనాన్స్ కొత్త వడ్డీ రేట్ల ప్రకారం.. మహిళా సీనియర్ సిటిజన్ తన సొమ్మును 60 నెలల కాలానికి FDగా పెట్టుబడి పెట్టినట్లయితే ఆమెకు అత్యధికంగా 9.36 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. అదెలా అంటే.. 60 నెలల FDకి సాధారణ కస్టమర్లకు 8.45 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్ల చొప్పున అంటే 8.99 శాతం వడ్డీ చెల్లించబడుతుంది. అలా మహిళా సీనియర్ సిటిజన్లు 9.36%.. (8.45% + 0.10% + 0.50% + 0.25%) ప్రయోజనం పొందుతారు.

Also Read:  TSPSC Notifications : TSPSC కి మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల

Exit mobile version