SIM Card Rule: సిమ్ కార్డుల జారీకి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం మార్చింది. భద్రతా కారణాల దృష్ట్యా టెలికమ్యూనికేషన్స్ విభాగం సిమ్ కార్డుల విక్రయ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అంటే ఆదివారం నుంచి అమలయ్యాయి. ఈ నిబంధనల ప్రకారం సిమ్ కార్డులను పెద్దమొత్తంలో విక్రయించడానికి సిమ్ డీలర్ల పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేయబడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా నకిలీ సిమ్ కార్డులు బయటపడతాయి. ఒకే పేరుతో లేదా ఐడితో ఎక్కువ సిమ్ కార్డుల విక్రయాలను నిలిపివేస్తుంది.
కొత్త సిమ్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం పోలీసు వెరిఫికేషన్ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో దాదాపు 10 లక్షల మంది సిమ్ కార్డ్ డీలర్లు పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవలసి ఉంటుంది. ఇది కాకుండా KYC కంపల్సరీ.
సిమ్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ నియమాలు డీలర్లతో పాటు కస్టమర్లను ప్రభావితం చేస్తాయి. కొత్త SIM కార్డ్ కొనుగోలు ప్రక్రియకు సమయం పట్టవచ్చు. SIM కార్డ్ పోతే కస్టమర్‌లు మళ్ళీ ధృవీకరణ ప్రక్రియ కొనసాగించి సిమ్ పొందాల్సి ఉంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కొత్త నిబంధనల ప్రకారం సిమ్‌లను విక్రయించే డీలర్‌లు మరియు రిటైల్ స్టోర్‌లకు కార్పొరేట్ ID నంబర్ CIN జారీ చేయబడుతుంది. CIN నంబర్ లేకుండా SIM కార్డ్‌లను విక్రయించలేరు. అలా దొరికితే జరిమానా విధించడంతోపాటు ఐడీని కూడా బ్లాక్ చేయవచ్చు. ఈ ID కోసం రిటైల్ స్టోర్ ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ మరియు GST వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.
Also Read: One Plus Diwali Sale : వన్ ప్లస్ దివాళి సేల్ ఆఫర్స్ ఇవే..!