Weekend Special : నాటుకోడి పులుసు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇలా చేయండి లొట్టలేసుకుని తింటారు..!!

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 12:39 PM IST

వీకెండ్ వచ్చిందంటే ఏదొక వెరైటీ ఉండాల్సిందే. చికెన్, మటన్, చేపలు..ఇలా డిఫరెంట్ రెసిపితో తినాలనిపిస్తుంది. అంతేకాదు చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తే నాటుకోడిపులుసు పెట్టేవాళ్లు. రుచి ఎంత అద్బుతంగా ఉండేదో తెలుసా. బాయిలర్ కోళ్లకంటే..నాటు కోళ్లు చాలా రుచిగా ఉంటాయి.

ఫారం కోడి మాంసంలా తొందరగా ఉడకదు. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిందే. రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతోమంచిది. జలుబు చేసిదంటే చాలు కాస్త కారం ఎక్కువగా వేసి వండిన నాటుకోడిపులుసు తింటే దెబ్బకు జలుబు పరార్ అవ్వాల్సిందే. నాటుకోడి పులుసును వేడి వేడి అన్నంతో కానీ, రోటీలతో కానీ..తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి పులుసు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

-500గ్రాముల నాటుకోడి మాంసం
-పావు టీస్పూన్ పసుపు
-1 టేబుల్ స్పూన్ ఉప్పు
-1 టేబుల్ స్పూన్ కారం
-1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
-ఆఫ్ నిమ్మకాయ
మసాలా కోసం
-1 టేబుల్ స్పూన్ ధనియాలు
-2 దాల్చిన చెక్కలు
-4 లవంగాలు
-1 టేబుల్ స్పూన్ గసగసాలు
-1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి
కర్రీ కోసం
2 మీడియం ఉల్లిపాయలు
3 పచ్చిమిర్చిలు
1 టేబుల్ స్పూర్ అల్లం వెల్లుల్లి
2 రెమ్మల కరివేపాకు
పావు టీ స్పూన్ పసుపు
ఉప్పు తగినంత
కారం
5 టేబుల్ స్పూన్ల కారం
హాప్ లీటర్ నీళ్లు
కొత్తమీర

తయారీ విధానం
చికెన్ కడిగి అందులో పసుపువేసి మజ్జిగ వేసి 5 నిమిషాలు నానపెట్టాలి. వాటిని మరోసారి కడగాలి. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం ధనియాల పొడి సగం నిమ్మకాయ వేసి బాగా కలిపి రెండు గంటలపాటు నానపెట్టాలి.

ఇప్పుడు ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు, సన్నని మంటపే వేయించాలి. గసగసాలు, కొబ్బరిపొడి, వేసి చిటపలాడించాలి. తర్వాత వీటన్నింటి పొడికొట్టి పక్కన పెట్టుకోవాలి.

ఒక ప్రెషర్ పాన్ లో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు , వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. తర్వాత నానపెట్టిన చికెన్ వేసి కలిపి మూత పెట్టాలి. 5 నుంచి 7 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మసాల వేసి సుమారు అరలీటరు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి పోయాక…మూత తెరిచి కొత్తమీరు వేయాలి. అంతే రెడీ.