Owls: గుడ్లగూబ ఫోటో రోజు చూస్తే కలిగే లాభాలు ఏంటో తెలుసా?

మనం తరచుగా చూసే పక్షులలో గుడ్లగూబ కూడా ఒకటి. ఈ గుడ్లగూబ పెద్ద కళ్ళతో కొంచెం చిన్న పొడవాటి ముక్కుతో చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 09:00 AM IST

మనం తరచుగా చూసే పక్షులలో గుడ్లగూబ కూడా ఒకటి. ఈ గుడ్లగూబ పెద్ద కళ్ళతో కొంచెం చిన్న పొడవాటి ముక్కుతో చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. అందుకే చాలామంది గుడ్లగూబను చూస్తే భయపడుతూ ఉంటారు. కానీ గుడ్లగూబని రెగ్యులర్ గా చూస్తున్నట్లు అయితే అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనాల్లో తెలిందట. మరి గుడ్లగూబని తరచుగా చూడటం వల్ల జరిగే ఆ అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తరచుగా గుడ్లగూబను చూస్తున్నట్లు అయితే అలాంటివారు తెలివైన వారు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవుతారట. అంతేకాకుండా మనుషుల్లో నానెడ్జిని పెంచే లక్షణం గుడ్లగూబలకు ఉంది అని తాజాగా పరిశోధనలలో తేలిందట.

ఒకవేళ మీరు గనక గుడ్లగూబను పెంచుకుంటున్నట్లయితే మిగతా వారి కంటే ఎక్కువగా నిశితంగా అలాగే ఏకాగ్రతతో చూస్తారు. అందుకే పురాణాలలో గుడ్లగూబలని మేధస్సు పెంచే పక్షులుగా తెలియని ప్రపంచానికి తీసుకెళ్లే మార్గదర్శనులుగా చెప్పుకునేవారు. గుడ్లగూబ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే మన జీవితంలో మార్పులు రావడం ఖాయమట. కారణం దాని కళ్ళలో ఉన్న శక్తి నట. ప్రతిరోజు దాదాపు పది నిమిషాల పాటు గుడ్లగూబ కళ్ళు ఉండే ఫోటోను చూస్తే లోతుగా నిశితంగా స్పష్టంగా కచ్చితత్వంతో ఆలోచించే అలవాటు పెరుగుతుంది అని పరిశోధనలు తేలిందట. గుడ్లగూబ కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం వల్ల మనం ఈ ప్రపంచాన్ని చూసే కోణం మారుతుందట.

గుడ్లగూబ కండ్లు గుండ్రంగా సూటిగా ఉండటం వల్ల ఎప్పుడైతే మనం ఆ కళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటామో, ప్రతిదీ తదేకంగా చూడటం అలవాటు అవుతుందట. గుడ్లగూబలో చీకట్లో కూడా స్పష్టంగా చూడగలవు. కానీ మనం అలా చూడలేము కాబట్టి. గుడ్లగూబ కళ్ళలోకి నిశితంగా కళ్ళు పెట్టి చూడటం వల్ల మన మెదడులో చూపుకు సంబంధించిన భాగాలు మరింత చురుకుగా పని చేస్తాయట. అలా గుడ్లగూబ కళ్ళను డైరెక్ట్ గా కానీ లేదంటే కలర్ఫుల్ క్లోజ్ ఫోటోలో 30 సెంటీమీటర్ల దూరం నుంచి ఈ రోజు పది నిమిషాలు చూడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఒకవేళ అంత సమయం లేకపోతే గుడ్లగూబ కళ్ళను మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నా పర్వాలేదు. అలా పెట్టుకోవడం వల్ల రోజులు కనీసం 20 సార్లు అయినా ఆ గుడ్లగూబ ఫోటోను చూస్తాం కొంతైనా ఉచితంగా గమనించే దృష్టి కోణం పెరుగుతుందట.