Aadhaar Card: ఆధార్ కార్డులో ఇవి అప్ డేట్ చేసుకున్నారా? లేదంటే రిస్కే.. ఎలా చేయాలంటే..

Aadhaar Card: ఆధార్ కార్డు ప్రస్తుతం అన్నింటికీ అవసరం అవుతోంది. సిమ్ కార్డు తీసుకోవడం మొదలు.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు లాంటివి పొందాలన్నా.. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏవి చేసుకోవాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే.

  • Written By:
  • Publish Date - November 6, 2022 / 08:50 PM IST

Aadhaar Card: ఆధార్ కార్డు ప్రస్తుతం అన్నింటికీ అవసరం అవుతోంది. సిమ్ కార్డు తీసుకోవడం మొదలు.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు లాంటివి పొందాలన్నా.. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏవి చేసుకోవాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే. మనకున్న చాలా డాక్యుమెంట్లకు కూడా ఆధార్ కార్డుతో లింకేజీ అయ్యి ఉంటాయి. వీటిలో బ్యాంకు ఖాతా ఒకటి. త్వరలో ఓటర్ కార్డుకు కూడా అందరూ మ్యాండేట్ గా ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి వస్తోంది.
మనకు ఐడీ ప్రూఫ్ లుగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు లాంటివి ఉన్నప్పటికీ ఆధార్ కార్డు ఉంటేనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డులో మన ఇంటి పేరుతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా వివరాలుంటాయి.
అయితే, చాలా సందర్భాల్లో ఆధార్ కార్డులోని వివరాలు మనం అప్ డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా వరకు ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో చిరునామా మారినా, లేదా పుట్టిన తేదీ, పేరులో ఏవైనా తప్పులున్నా వెంటనే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ నంబరు సక్రమంగా ఉంటేనే ఏ మార్పులైనా చేయడానికి వీలవుతుంది.
ఫోన్ నంబరు మారిస్తే.. ఇలా అప్ డేట్ చేసుకోండి..
ఫోన్ నంబరు మార్చినట్లయితే వెంటనే ఆధార్ తో అనుసంధానం చేసి అప్ డేట్ చేసుకోవాలి. మొదట కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్ uidai.gov.in లోకి వెళ్లాలి. అప్ డేట్ చేయాల్సిన ఫోన్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ నమోదు చేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి ప్రాసెస్ చేయాలి. తర్వాత ఆఫ్ లైన్ ఆధార్ సర్వీస్ ఆప్షన్ వస్తుంది. అనంతరం మీరు అప్ డేట్ చేయాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఫోన్ నంబర్ అప్ డేట్ పై క్లిక్ చేసి నంబర్ ఎంటర్ చేయాలి. కొత్త పేజీ వస్తుంది. అక్కడ క్యాప్చా కోడ్, ఓటీపీ ఎంటర్ చేయాలి. అనంతరం ఆన్ లైన్ అపాయింట్ మెంట్ తీసుకొని నియరెస్ట్ ఆధార్ సెంటర్ కు వెళ్లి మొబైల్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలి.