Site icon HashtagU Telugu

Cafe Mysore: అప్పట్లో అంబానీ అడ్డా మైసూర్ కేఫ్

Cafe Mysore

Cafe Mysore

Cafe Mysore: ప్రపంచ కుబేరుల్లో అంబానీ కుటుంబం ఒకటి. ధీరుభాయి అంబానీ సృష్టించిన సామ్రాజ్యాన్ని ముఖేష్ అంబానీ ముందుకు తీసుకెళ్తున్నాడు. తన తోడబుట్టువు అనిల్ అంబానీ విడిగా వ్యాపారాలు చేసి దారుణంగా నష్టపోయాడు. అప్పులను తీర్చేందుకు వేరో చోట కొత్తగా అప్పులు చేస్తూ పాతాళంలోకి పడిపోయాడు. కానీ ముఖేష్ పక్క ప్రణాళికలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తూ ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించాడు.

అంబానీ ఫుడ్ లవర్ అని చాలా మందికి తెలియదు. అయితే ఆయన సెలెక్టీవ్ గా తీసుకుంటారు. ఇడ్లీ సాంబార్ ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తన ఫెవరెట్ అయిన మైసూర్ కేఫ్ నుంచి వచ్చిన ఏ ఫుడ్ అయినా ఇష్టంగా తింటుంటారు. విశేషం ఏంటంటే అంబానీ విద్యార్థి దశ నుంచే మైసూర్ కేఫ్ అంటే ఇష్టపడేవాడు.ముఖేష్ అంబానీ చాలా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైసూర్ కేఫ్ తనకు ఇష్టమైన రెస్టారెంట్ అని, విద్యార్థిగా ఉన్నప్పుడు తరచుగా ఆ కేఫ్ ని సందర్శించేవాడినని చెప్తుండేవారు.

జూలై 13న జరిగిన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు రాధిక, అనంత్‌ల ‘శుభ్ ఆశీర్వాదం’ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ , ప్రపంచ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, ఆధ్యాత్మిక నేతలు, రాజకీయ నాయకులు తదితరులు హాజరయ్యారు. అంబానీ ఇంట పెళ్లికి వచ్చిన ప్రముఖుల్లో శాంతేరి నాయక్‌ ఒకరు. పెళ్లి వేడుకలో ఆమెను చూడగానే అనంత్‌ ఆప్యాయంగా పలకరించారు. తన భార్య రాధికను పిలిచి శాంతేరి నాయక్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. తమ ఇంట్లో అందరం మైసూరు కేఫ్ భోజనమే తింటున్నాంమనిని రాధిక చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.దీంతో మైసూర్ కేఫ్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.

ముంబైలోని మతుంగాలో మైసూర్‌ కేఫ్‌ ఉంటుంది. 1936లో దీన్ని ఏర్పాటు ప్రారంబించారు. ముకేశ్ అంబానీ చదువుకునే రోజుల్లో ఇక్కడే తినేవారు.అంతేకాదు ఈ రోజుకి కూడా అంబానీ కుటుంబం ప్రతి ఆదివారం అక్కడి నుంచే భోజనం తెప్పించుకుంటున్నారు. అందుకే అంబానీ కుటుంబానికి మైసూర్ కేఫ్ ఓనర్ అంటే అంత అభిమానం.

Also Read: Mahindra Scorpio: అమ్మ‌కాల్లో దూసుకుపోతున్న మ‌హీంద్రా స్కార్పియో..!