Ticket Collector To Dhoni : రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఓ యువకుడు ప్రభంజనం సృష్టించాడు..
జనమందరూ మెచ్చుకునే తిరుగులేని లెజెండ్ గా ఎదిగాడు..
క్రికెట్ ను ఇష్టపడే ఇండియన్స్ పాలిట ఆశాదీపంలా ఉదయించాడు..
ఈ విశేషణాలన్నీ మన MS ధోనీ గురించే..
ఈరోజు జార్ఖండ్ డైనమైట్ 42వ పుట్టిన రోజు.. హ్యాపీ బర్త్ డే ధోనీ !!
మహేంద్ర సింగ్ ధోనీ 1981 జూలై 7న జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించాడు. ఆయన తండ్రి పాన్ సింగ్ భారత ప్రభుత్వ కంపెనీ మెకాన్‌లో ఉద్యోగి. స్కూల్ డేస్ లో ధోనీ .. బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ బాగా ఆడేవాడు. ఇంట్లో వాళ్ళు ధోనీని .. మహి అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచే సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లకు ధోనీ అభిమాని. రాంచీ జిల్లా ఫుట్ బాల్ టీమ్ లో గోల్ కీపర్ గా ధోనీ ఆడేవాడు.. కానీ అతడి కోచ్ ఒకరోజు పిలిచి.. స్థానిక క్రికెట్ క్లబ్ కోసం మ్యాచ్ ఆడేందుకు పంపారు. అప్పుడు (1995-1998 సమయంలో) తొలిసారిగా కమాండో క్రికెట్ క్లబ్‌లో వికెట్ కీపర్‌గా ధోనీ(Ticket Collector To Dhoni) మారాడు. ఆ తర్వాత వినోద్ మన్కడ్ ట్రోఫీ అండర్-16 ఛాంపియన్‌షిప్ కు వెళ్లే టీమ్ కు ధోనీ ఎంపికయ్యాడు. 10వ తరగతి పాసైన తర్వాత క్రికెట్‌పై అతడు దృష్టి సారించాడు.
Also read : UCC Vs Communities : యూనిఫామ్ సివిల్ కోడ్.. ఏ మతంపై.. ఏ ప్రభావం ?
12వ తరగతి చదువుతుండగా..
1998లో ధోనీ 12వ తరగతి చదువుతుండగా.. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) జట్టుకు ఎంపికయ్యాడు. ప్రతి సిక్స్ కోసం రూ.50 ఇస్తానని అతడి మెంటర్ దేవల్ సహాయ్ చెప్పడంతో ధోనీ చెలరేగాడు. హార్డ్ హిట్టింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత దేవల్ సహాయ్ తన పరిచయాలను ఉపయోగించి ధోనీని బీహార్ టీమ్ లో ఛాన్స్ ఇప్పించాడు. ఈవిధంగా 1998-99లో బీహార్ అండర్-19 టీమ్ లో ధోనీ చేరాడు. 2001 నుంచి 2003 వరకు ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)గా ధోనీ పనిచేశాడు.2004-05లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఇండియా వన్డే టీమ్ కు వికెట్ కీపర్‌గా ధోని ఎంపికయ్యాడు.
Also read : Pooja Hegde : షార్ట్ డ్రెస్‌లో వైకుంఠపురం బ్యూటీ హాట్ లుక్స్
విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో..
విశాఖపట్నంలో జరిగిన తన ఐదో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో .. ధోని కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే.ధోని తన స్కూల్‌మేట్ సాక్షి రావల్‌ను 2010 జూలై 4న పెళ్లి చేసుకున్నాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లోని అన్ని గ్రూప్ దశల మ్యాచ్‌లను గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారత్ విజయం సాధించింది.క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత, అతను 100 ODI మ్యాచ్‌లు గెలిచిన మొదటి నాన్-ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ ధోనితో US$1.5 మిలియన్లకు ఒప్పందం చేసుకుంది. ఈవిధంగా ఐపీఎల్ తొలి సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్స్.. 2010 మరియు 2014 ఛాంపియన్స్ లీగ్ T20 టైటిళ్లను గెలుచుకుంది.