Mother of MLA: కొడుకు ఎమ్మెల్యే.. తల్లి స్కూల్ స్వీపర్!

సాధారణంగా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నత ఉద్యోగాలు చేస్తుంటే.. ఆ ఇంట్లోని వాళ్లు చిన్నచితక పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ తన కొడుకు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, ఓ తల్లి మాత్రం ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 

  • Written By:
  • Updated On - March 14, 2022 / 12:58 PM IST

సాధారణంగా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నత ఉద్యోగాలు చేస్తుంటే.. ఆ ఇంట్లోని వాళ్లు చిన్నచితక పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ తన కొడుకు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, ఓ తల్లి మాత్రం ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఎమ్మెల్యే లబ్ సింగ్ ఉగోకే పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే ఆమె తల్లి బల్దేవ్ కౌర్ తన కుమారుడు గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తూనే ఉన్నారు. బదౌర్ స్థానం నుంచి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఓడించిన  ఎమ్మెల్యే అభ్యర్థి ఉగోకే మొబైల్ రిపేరింగ్ షాపులో పనిచేసేవారు. కుటుంబ పోషణ కోసం మేం ఎంతో కష్టపడ్డాం. కొడుకు ఎమ్మెల్యేగా గెలిచిన కూడా నా పనిని ఆపేదీ లేదు. స్వీపర్ గా బాధ్యతలు నిర్వహిస్తానని ఎమ్మెల్యే తల్లి కౌర్ చెప్పారు.

పార్టీ గుర్తు ‘చీపురు’తో తన కుమారుడు ఆప్ అభ్యర్థిగా గెలుపొందడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన కౌర్ తన జీవితంలో మరిచిపోలేని విషయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఆయన పోటీ చేసినప్పటికీ నా కొడుకు గెలుస్తాడనే నమ్మకం మాకుంది. ఉగోకే అదే స్కూల్‌లో చదివి ఎన్నో అవార్డులు తెచ్చారని స్కూల్ ప్రిన్సిపల్ అమృత్ పాల్ తెలిపారు. ‘‘ఉగోకే తల్లి చాలా కాలంగా ఈ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. అతను కూడా ఈ పాఠశాలలోనే చదువుకున్నాడు. విద్యార్థిగా గ్రామానికి, పాఠశాలకు అనేక అవార్డులను తీసుకుకొచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు.

కూలి పని చేసే సింగ్ తండ్రి దర్శన్ సింగ్ మాత్రం స్పందిస్తూ.. ‘‘తన కుటుంబం మునుపటిలా జీవనం కొనసాగిస్తుంది. తన కొడుకు కుటుంబంపై కాకుండా ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. గ్రామ ప్రజలు అతనిని ఎన్నుకున్నారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని కోరుకున్న’’ అని తండ్రి దర్శన్ సింగ్ అన్నారు. ఉగోకే 2013లో ఆప్‌లో చేరారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ‘‘ఇంతకాలం తెలిసిన ఊగోకే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడంటే నమ్మలేకపోతున్నామని, ఆయన గెలుపు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రాత్రి పగలు పార్టీ కోసం పని చేసేవాడు. పార్టీ నుంచి టికెట్ వస్తుందని, ఎమ్మెల్యే అవుతారని మేం ఎప్పుడూ అనుకోలేదు. అతని గెలుపు ఊరందరిలో ఆనందం నిపింది’’ అని గ్రామస్తుడొకరు పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. 92 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని కొత్త చరిత్ర లిఖించింది.