Site icon HashtagU Telugu

Planets: మర్చి 28న రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఒకేసారి ఐదు గ్రహాలు మనకు కనిపించబోతున్నాయి..

Miracle In The Night Sky On March 28.. We Are Going To See Five Planets At The Same Time..

Miracle In The Night Sky On March 28.. We Are Going To See Five Planets At The Same Time..

5 Planets : ఆకాశంలో అరుదైన, అద్భుతమైన దృశ్యం మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ నెల 28న రాత్రి నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి. వీలుంటే మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్ రెడీగా ఉంచుకోండి. ఐదు గ్రహాలు (5 Planets) ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు సమీపానికి రానున్నారు. వీటికి చంద్రుడు అదనంగా కనిపిస్తాడు.

‘‘సూర్యాస్తమం తర్వాత పశ్చిమం వైపు చూడాలి. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు’’ అని నాసాకు చెందిన బిల్ కూక్ సూచించారు. 2022 జూన్ లోనూ ఇలాంటి అద్భతమే ఒకటి కనిపించింది. నాడు బుధగ్రహం, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఒకే లేఖనంపైకి వచ్చారు. అమెరికా మాజీ ఖళోగ శాస్త్రవేత్త, చంద్రుడిపై నడిచిన తొలి వ్యొమగామి అయిన డాక్టర్ బజ్ ఆల్డ్రిన్ కూడా 28న రాత్రి ఆకాశం వైపు చూడాలని సూచించారు.

Also Read:  Shikhar Dhawan: 15 ఏళ్ల వయసులోనే నేను హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నా.. శిఖర్ ధావన్