Mini Brazil In India : ఇండియాలో “మినీ బ్రెజిల్” ఉంది తెలుసా ?.. ప్రధాని మోడీ కూడా ఆ ఊరిని ఆకాశానికెత్తారు !

Mini Brazil In India : తాజాగా "మన్ కీ బాత్" లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక గ్రామం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

  • Written By:
  • Updated On - July 31, 2023 / 08:55 AM IST

Mini Brazil In India : తాజాగా “మన్ కీ బాత్” లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక గ్రామం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

ఆ విలేజ్ ను “మినీ బ్రెజిల్”గా అభివర్ణించారు. 

ఎందుకంటే బ్రెజిల్ నేషనల్  గేమ్ “ఫుట్ బాల్”కు ఆ ఊరిలో అంతగా క్రేజ్ ఉంది. 

అక్కడ ఎవరిని పలకరించినా..  “నాకు ఫుట్ బాల్ గేమ్ గురించి బాగా తెలుసు” అని చెబుతారు. 

దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్రౌండ్స్ లో క్రికెట్ సందడి కనిపిస్తే.. ఈ ఊరిలోని గ్రౌండ్స్ లో మాత్రం ఫుట్ బాల్ సవ్వడి వినిపిస్తుంది. 

ఇంతకీ ఆ ఊరు ఏది ? ఎక్కడుంది ?

Also read : Weekly Horoscope : ఓ రాశి వాళ్లకు ఆర్థిక నష్టాలు.. మరో రాశి వాళ్లకు ఉద్యోగ కష్టాలు

ఇండియా ఫుట్ బాల్ టీమ్ కు 45 మందిని అందించి..  

ఫుట్‌బాల్ అంటే.. ఆ ఊరి ప్రజలు చెవి కోసుకుంటారు. ఆ గేమ్ ను ఎంతో ఇష్టంగా.. ఎంతో ఇంట్రెస్ట్ తో ఆడుతారు.  ఇక సెలవులు, పండుగల టైం వచ్చిందంటే ఊరిలోని పిల్లలు, యూత్ ఫుట్ బాల్ ఆడటంలో మునిగిపోతారు. మనం చెప్పుకుంటున్నది మధ్యప్రదేశ్ లోని షాహ్‌దోల్ జిల్లాలో ఉన్న గిరిజన గ్రామం  బిచార్‌పూర్ గురించి. ఆ ఊరి జనాభా 2500లోపే.  జనాభా తక్కువగా ఉంటేనేం.. మన ఇండియా ఫుట్ బాల్ టీమ్ కు ఆ పల్లె  45 మంది క్రీడాకారులను అందించింది. ఈ ఊరిలో ప్రతి ఇంటికి ఒక ఫుట్‌బాల్ ఆటగాడు ఉంటాడు. అందుకే దానికి మినీ బ్రెజిల్(Mini Brazil In India) అనే పేరొచ్చింది. బిచార్‌పూర్  గ్రామం గోండ్, బైగా తెగలకు నిలయం.

Also read : Underarms: చంకల్లో నలుపు తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే?

కోచ్‌ రయీస్‌ అహ్మద్‌  చలువే..

బిచార్‌పూర్  నుంచి షాహ్‌దోల్ జిల్లా కేంద్రం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షాహ్‌దోల్ జిల్లా కేంద్రంలో  రైల్వే టీమ్‌కి ట్రైనింగ్ ఇస్తున్న కోచ్‌ రయీస్‌ అహ్మద్‌ ఒకసారి బిచార్‌పూర్  గ్రామానికి వచ్చినప్పుడు.. అక్కడి  ఆదివాసీ పిల్లల శక్తివంతమైన ఫుట్ బాల్  కిక్‌లను చూసి ఆకర్షితులు అయ్యారు. షాడోల్‌లోని రైల్వే ప్లేగ్రౌండ్‌కు వచ్చి  ఫుట్ బాల్  కోచింగ్ తీసుకోవాలని వారికి సలహా ఇచ్చారు. అయితే ఆర్థిక స్థోమత లేక బిచార్‌పూర్ లోని పిల్లలు, యూత్ కోచింగ్ కోసం  షాహ్‌దోల్ రైల్వే ప్లేగ్రౌండ్‌కు రాలేదు. దీంతో ప్రతిరోజూ సాయంత్రం  ఆ ఊరికి వెళ్లి పిల్లలకు ఫుట్ బాల్  కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు  కోచ్‌ రయీస్‌ అహ్మద్‌. ఈవిధంగా ఇండియాలో మినీ బ్రెజిల్ కు  కోచ్‌ రయీస్‌ అహ్మద్‌ పునాది వేశారు. అక్కడి స్టూడెంట్స్, యూత్  ఫుట్ బాల్ లో మెరిసేలా తయారు కావడానికి ప్రధాన కారకుడు ఆయనే.  ప్రస్తుతం రయీస్ అహ్మద్ షాదోల్ డివిజన్‌లో పాఠశాల విద్యా శాఖలో అదనపు డైరెక్టర్ (క్రీడలు)గా ఉన్నారు. మన ఇండియా ఫుట్ బాల్ టీమ్ కు  బిచార్‌పూర్ ఇప్పటివరకు 45 మంది క్రీడాకారులను అందించింది. బిచార్‌పూర్‌ కు చెందిన ఎందరో ఫుట్ బాల్ ప్లేయర్స్ .. ఫుట్‌బాల్ కోచ్‌లుగా మంచిపేరు సంపాదించారు. జూన్ 27న ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన 100 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులలో బిచార్‌పూర్‌కు చెందిన యష్ బైగా, అనిదేవ్ సింగ్ కూడా ఉన్నారు.