Site icon HashtagU Telugu

IAS Without Coaching : జాబ్ చేస్తూ.. కోచింగ్ లేకుండానే సివిల్స్ లో విజయఢంకా

Ias Without Coaching

Ias Without Coaching

IAS Without Coaching : ఐఏఎస్ ఎగ్జామ్ అనగానే చాలామంది భయపడిపోతుంటారు. అది ఇండియాలోనే చాలా టఫ్ ఎగ్జామ్ అని చెబుతుంటారు. కోచింగ్ లేనిదే ఆ ఎగ్జామ్ లో గట్టెక్కలేమని కుండబద్దలు కొడుతుంటారు. జాబ్ చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ కావడం కష్టం అని కూడా చెబుతుంటారు. వీటన్నింటిని పక్కకు పెట్టి.. ఐఏఎస్ ఎగ్జామ్ ను క్రాక్ చేసిన  వందనా పోఖ్రియాల్ గురించి తెలుసుకుంటే మన మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది.  2015లో ఆమె యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో ఆలిండియా 83వ ర్యాంకును సాధించారు. అప్పుడు ఆమె ఏజ్ 26 ఏళ్లు. ఉత్తరాఖండ్‌లోని బిరోంఖాల్‌ అనే కుగ్రామానికి చెందిన వందనా పోఖ్రియాల్ సివిల్స్ విజయం నిజంగా అద్భుతమే.

Also read : Indian Shooters Win Gold: బిగ్ బ్రేకింగ్.. ఆసియా క్రీడలలో భారత్ కు నాలుగో స్వర్ణం

ఎందుకంటే వందనా పోఖ్రియాల్ గుజరాత్‌లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ గా జాబ్ చేస్తూనే సివిల్స్ కు సీరియస్ గా ప్రిపేర్ అయ్యారు. కనీసం లీవ్స్ కూడా పెట్టలేదు. ఎలాంటి కోచింగ్ సైతం తీసుకోలేదు. సివిల్స్ కొట్టాలనే కసితో ప్రిపరేషన్ ను సాగించి.. తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అయితే మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ఆమె క్వాలిఫై కాలేకపోయారు. రెండోసారి మాత్రం ఆలిండియా 83వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం పోఖ్రియాల్ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.వందనా పోఖ్రియాల్ తండ్రి చంద్ర శశి భారత సైన్యంలో రిటైర్డ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్. ఆమె తల్లి పేరు మంజు పోఖ్రియాల్. వందన విద్యాభ్యాసమంతా వివిధ రాష్ట్రాల ఆర్మీ పాఠశాలలలో సాగింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు వెళ్లి బయోటెక్‌లో గ్రాడ్యుయేషన్‌ (IAS Without Coaching) చేశారు.