Site icon HashtagU Telugu

World Test Championship: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్స్‌ వీళ్లే .. ఆయన కూడా ఉన్నాడుగా..!

World Test Championship

Resizeimagesize (1280 X 720) 11zon

World Test Championship: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. జూన్ 7న ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC ఫైనల్ 2023) గెలవాలని ప్రయత్నిస్తుంది. తొలి ఎడిషన్‌లో కోహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌కు అంపైర్లను ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 48 ఏళ్ల గఫానీ తన 49వ టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

అదే సమయంలో 59 ఏళ్ల ఇల్లింగ్‌వర్త్‌కు ఇది 64వ టెస్ట్‌ మ్యాచ్‌. యాదృచ్ఛికంగా, ఇల్లింగ్‌వర్త్‌ కూడా రెండేళ్ల క్రితం సౌతాంప్టన్‌లో భారత్‌పై ఎనిమిది వికెట్ల విజయంతో న్యూజిలాండ్‌ గెలిచిన మొదటి డబ్ల్యుటిసి ఫైనల్‌లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. మరో ఇంగ్లాండ్‌ అంపైర్‌, రిచర్డ్‌ కెటిల్‌బరో టీవీ అంపైర్‌గా నియమితులయ్యారు. శ్రీలంకకు చెందిన కుమార్‌ ధర్మసేన నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారని ఐసీసీ తాజా ప్రకటన తెలిపింది.

Also Read: IPL FINAL Winner: ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఉత్కంఠ పోరులో నెగ్గి టైటిల్ కైవసం..!

WTCకి ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఎంపికయ్యారు. మరొక ఇంగ్లీష్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో మరోసారి టీవీ అంపైర్‌గా నియమితులైన తర్వాత వరుసగా రెండవ WTC ఫైనల్‌లో కూడా అధికారిగా వ్యవహరిస్తారు. టీమిండియాని భయపెడుతున్న పేరు రిచర్డ్ కెటిల్‌బరో. 2014 నుంచి రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా వ్యవహరించిన ప్రతీ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి పాలైంది. శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన నాలుగో అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన రిచీ రిచర్డ్‌సన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారనున్నారు.

ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని కోచ్ రాహుల్ ద్రవిడ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ వంటి జట్టు ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

WTC కోసం టీమ్ ఇండియా జట్టు: రోహిత్ శర్మ (c), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, KS భరత్ (wk), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్