Anant Ambani Wedding : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 12న అనంత్ అంబానీ వివాహం జరగనుంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అనంత్ అంబానీకి ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌తో పెళ్లి జరగబోతోంది. అంబానీ ఇంట పెళ్లి అంటే అతిరథ మహారథులు అతిథులుగా వస్తారు. ఈ పెళ్లి జరిగే జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో.. వాటికి ఏ మాత్రం రేంజు తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ (Anant Ambani Wedding) వేడుకలకు హాజరయ్యేందుకు జామ్ నగర్‌కు వచ్చే అతిథుల కోసం 5 స్టార్ హోటళ్లను తలదన్నేలా అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లగ్జరీ టెంట్లలో టైల్డ్ బాత్‌రూమ్‌లు సహా సకల సౌకర్యాలు ఉంటాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం ఢిల్లీ, ముంబైల నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. హాలీవుడ్ పాప్ గాయని రిహన్నాతో పాటు దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానం అందుకున్న వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఉన్నారు.
- మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్ కూడా అతిథుల లిస్టులో ఉన్నారు.
- వ్యాపార దిగ్గజాలు గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ ఛైర్‌పర్సన్ కుమార్ మంగళం బిర్లా, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, విప్రో రిషద్ ప్రేమ్‌జీ, ఉదయ్ కోటక్, అదర్ పూనావాలా, సునీల్ మిత్తల్, పవన్ ముంజాల్, రోష్ని నాడార్, నిఖిల్ కామత్, రొన్నీ స్క్రూవాలా, దిలీప్ సంఘ్వీలకు ఆహ్వానాలు అందాయి.
Also Read : Xmail : ‘ఎక్స్ మెయిల్’ వస్తోంది.. జీమెయిల్‌కు ఇక పోటీ
ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా.. వివాహానికి చాలా పవిత్రమైన ప్రారంభాన్ని సూచిస్తూ, అంబానీ కుటుంబం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న భారీ ఆలయ సముదాయంలో 14 కొత్త ఆలయాలను నిర్మించింది. ఇక్కడ ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు, దేవతల శిల్పాలు, ఫ్రెస్కో శైలి పెయింటింగ్‌లు.. తరతరాలుగా కళాత్మక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన వాస్తుశిల్పంతో కూడిన ఈ ఆలయ సముదాయం భారతదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును కలిగి ఉంది.