Ratan Tata Untold Love Story: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా (Ratan Tata Untold Love Story) ది పార్శి కుటుంబం. తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోతే బామ్మ దత్తత తీసుకుని మరీ పెంచింది. ఓ దిగువ స్థాయి ఉద్యోగంతో తన ప్రయాణం స్టార్ట్ చేశారు రతన్ టాటా. ఆ తర్వాత కంపెనీలో క్రమేపీ పలు హోదాలకు ఎదిగి, గ్రూపును ఓ పటిష్టమైన గ్లోబల్ వ్యాపార సంస్థలా మార్చింది రతన్ టాటానే. టాటా అంటే కేవలం వ్యాపారమే కాదు.. ఆదాయంలో ఎక్కువగా సామాజికసేవకు, దాతృత్వానికి వెచ్చించే గొప్ప వితరణశీలి.
అంట్లు తోమిన రతన్ టాటా
నావల్ టాటా – సోనీ టాటా దంపతులకు రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. కాంపెయిన్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన రతన్ ఉన్నత విద్య కోసం అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ డబ్బు కోసం చిన్నా చితకా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. కొంతకాలం అంట్లు కూడా తోమారు రతన్. రతన్ టాటా ప్రస్థానం ఓ సాధారణ ఉద్యోగిగానే ప్రారంభమైంది.
Also Read: Ratan Naval Tata : సమాజం కోసమే సంపదను సృష్టించిన ‘టాటా’
లవ్ స్టోరీ కూడా నడిపారు
రతన్ టాటా బ్రహ్మచారి. పెళ్లి కాలేదు, పిల్లల్లేరు. అయితే ఆయన పెళ్లి చేసుకోకపోవటానికి గల కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. రతన్ టాటా చదువుకోవటానికి అమెరికాకు వెళ్లినప్పుడు ఒకామెను ప్రేమించారు. 1961-62 నాటి లవ్ స్టోరీ రతన్ టాటాది. పెళ్లి సమయానికి ఇండో-చైనా యుద్ధం. దీంతో యువతి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించడానికి ఒప్పుకోలేదు. దీంతో రతన్ టాటా కూడా ఏం చేయలేకపోయాడు. మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమై, పెళ్లి పత్రికలు ముద్రించే దాకా వెళ్లింది. కానీ అదీ ఆగిపోయింది. అంతే ఇక తను పెళ్లి మాటే ఎత్తలేదు.
సీఎం రేవంత్ సంతాపం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరనిలోటు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. టాటా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’అని తెలిపారు.