Lottery-13 States-Why : లాటరీ టికెట్ల సేల్స్.. 13 రాష్ట్రాల్లోనే ఎందుకు ?

Lottery-13 States-Why : లాటరీ.. ఈ మాట చెప్పగానే మనకు కేరళ, గోవా గుర్తుకు వస్తాయి.. అక్కడ లాటరీ అమ్మకాలను అనుమతి ఉంది.  కొన్ని రాష్ట్రాల్లో లాటరీ సేల్స్ లీగల్.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్ .. ఎందుకు ?

  • Written By:
  • Updated On - July 4, 2023 / 11:05 AM IST

Lottery-13 States-Why : లాటరీ టికెట్.. 

ఈ మాట చెప్పగానే మనకు కేరళ, గోవా గుర్తుకు వస్తాయి.. 

అక్కడ లాటరీ టికెట్ల అమ్మకాలను అనుమతి ఉంది.  

ఈ రెండు స్టేట్స్ మాత్రమే కాదు.. దేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో లాటరీ సేల్స్ లీగల్ గా జరుగుతుంటాయి. 

ఈ లిస్టులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, మిజోరం కూడా ఉన్నాయి. 

కొన్ని రాష్ట్రాల్లో లాటరీ  టికెట్ల  సేల్స్ లీగల్.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్ .. ఎందుకు ?

‘లాటరీ నియంత్రణ చట్టం 1998’ ద్వారా లాటరీ టికెట్ల సేల్స్ పై రాష్ట్ర  ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. మన దేశంలోని 13 రాష్ట్రాల్లో (Lottery-13 States-Why) లాటరీల నిర్వహణ చట్టబద్ధం. ప్రైవేటు వ్యక్తులు లాటరీని నిర్వహించడం నిషేధం. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే వీటిని నిర్వహిస్తాయి.  ప్రభుత్వాలే నిర్వహించే ఈ రాష్ట్రాల లాటరీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. వీటిని, భారత ప్రభుత్వ ఆర్ధిక శాఖ పర్యవేక్షిస్తుంది. టాప్ బహుమతులను ప్రత్యేక లాటరీ విభాగం ఇస్తుండగా, చిన్నచిన్న బహుమతులను టికెట్ అమ్మకందారులు ఇస్తారు. లాటరీ టికెట్‌తో పాటు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రానికి చెందినవారిని మాత్రమే లాటరీ టికెట్లను కొనుక్కునేందుకు అనుమతిస్తాయి. ఇతర రాష్ట్రాల వారిని అనుమతించవు. ముందుగానే నిర్వహించిన తేదీల్లో ప్రత్యేక డ్రా లను నిర్వహిస్తారు. కేరళలో ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లను అమ్మడం నిషేధం. పంజాబ్‌లో ఇందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్స్ కూడా అమ్ముతారు.

Also read : 6G-India : 6జీ రెడీ అవుతుందోచ్.. 200 పేటెంట్లు కొన్న ఇండియా

లాటరీ టికెట్ల సేల్స్ అన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో లాటరీ టికెట్లను కొనుక్కోవడం చట్టబద్ధం కానీ, కొన్ని రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేకం. రెండేళ్ల క్రితం, లాటరీ అమ్మకాలను నిషేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. లాటరీని విక్రయించే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించేందుకు నిరాకరించింది. ఇక కేసినో, గుర్రపు పందేలు, జూదం లాంటి కార్యకలాపాలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నప్పటికీ.. కొన్నిచోట్ల రాష్ట్ర  ప్రభుత్వాలే లాటరీలను నిర్వహిస్తున్నాయి. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా కేరళ రాష్ట్రం  ప్రైవేటు వ్యక్తులు లాటరీ నిర్వహించడాన్ని బ్యాన్ చేసి.. దాని నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంది. తర్వాత మరి కొన్ని రాష్ట్రాలు కేరళను అనుసరించాయి. 1967 నుంచే కేరళ రాష్ట్రంలో వీక్లి లాటరీ సేల్స్ ను రాష్ట్ర ప్రభుత్వ లాటరీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. కేరళలో వారానికి సగటున 4 కోట్ల లాటరీ టికెట్లు అమ్ముడవుతాయని అంచనా.