Site icon HashtagU Telugu

Most Educated Countries: అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో ఇండియా, అగ్రస్థానంలో ఏ దేశం?

Most Educated Countries

Most Educated Countries

Most Educated Countries: చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక పుస్తకం కొనుక్కో అన్న సామెత విద్యార్థులకు మంచి సందేశంగా భావించొచ్చు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే శక్తి కేవలం ఒక విద్యకే ఉంటుంది. దీనికి కులం, మతంతో సంబంధం లేదు. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉపయోగపడేది కేవలం విద్య మాత్రమే అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఇంతకీ విద్య స్థాయిలో ఏఏ దేశాలు ఏ స్థానంలో ఉన్నాయి ? భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉందొ తెలుసుకుందాం.

ఐరోపాలోని దేశాల ఆధిపత్యంలో ఉన్న ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అధ్యయనంలో 25 నుండి 34 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులలో 20 శాతం మంది తృతీయ విద్యను పూర్తి చేసినట్లు తేలింది. ఇందులో దక్షిణ కొరియా అత్యధిక శాతం కలిగి ఉంది. 69 శాతంతో ఈ దేశం ప్రపంచంలో అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

దక్షిణ కొరియా తర్వాత కెనడాలో అత్యధిక శాతం విద్యావంతులు ఉన్నారు. అత్యధిక తలసరి GDPతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన లక్సెంబర్గ్ 60 శాతం మంది విద్యావంతులతో ఆరవ స్థానాన్ని ఆక్రమించింది.ఆశ్చర్యకరం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ జాబితాలో అనేక యూరోపియన్ దేశాల కంటే వెనుకబడి ఉంది. ఐరోపాలోని ప్రధాన దేశాలలో ఒకటైన జర్మనీ కూడా ఈ జాబితాలో దిగువ స్థానంలో ఉంది. భారతదేశం జాబితాలో 43వ స్థానంలో ఉంది.

ప్రపంచంలో అత్యంత విద్యావంతులైన దేశాల పూర్తి జాబితా:

దక్షిణ కొరియా: 69%
కెనడా: 67%
జపాన్: 65%
ఐర్లాండ్: 63%
రష్యా: 62%
లక్సెంబర్గ్: 60%
లిథువేనియా: 58%
UK: 57%
నెదర్లాండ్స్: 56%
నార్వే: 56%
ఆస్ట్రేలియా: 56%
స్వీడన్: 52%
బెల్జియం: 51%
స్విట్జర్లాండ్: 51%
యునైటెడ్ స్టేట్స్: 51%
స్పెయిన్: 50%
ఫ్రాన్స్: 50%
డెన్మార్క్: 49%
స్లోవేనియా: 47%
ఇజ్రాయెల్: 46%
లాట్వియా: 45%
గ్రీస్: 45%
పోర్చుగల్: 44%
న్యూజిలాండ్: 44%
ఎస్టోనియా: 44%
ఆస్ట్రియా: 43%
టర్కీ: 41%
ఐస్లాండ్: 41%
ఫిన్లాండ్: 40%
పోలాండ్: 40%
చిలీ: 40%
స్లోవేకియా: 39%
జర్మనీ: 37%
చెకియా: 34%
కొలంబియా: 34%
హంగేరి: 32%
కోస్టా రికా: 31%
ఇటలీ: 29%
మెక్సికో: 27%
చైనా: 27%
సౌదీ అరేబియా: 26%
బ్రెజిల్: 23%
భారతదేశం: 20%
అర్జెంటీనా: 19%
ఇండోనేషియా: 18%
దక్షిణాఫ్రికా: 13%

Also Read: Court Named Child : ఆ పాపకు కోర్టు పేరు పెట్టింది.. ఎందుకంటే ?

Exit mobile version