Site icon HashtagU Telugu

Singapore : సింగపూర్‌ కొత్త ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌ ప్రమాణస్వీకారం

Lawrence Wong sworn in as the new Prime Minister of Singapore

Lawrence Wong sworn in as the new Prime Minister of Singapore

Singapore: సింగపూర్‌ నాలుగో నూతన ప్రధానిగా(new prime minister) ఆర్థికవేత్త లారెన్స్‌ వాంగ్‌(Lawrence Wang)(51) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్‌ లూంగ్‌(71) ప్రధానిగా వ్యవహరించగా..వాంగ్‌ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వీరిద్దరూ కూడా పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన నాయకులే. వాంగ్‌ ప్రధాని పదవితోపాటు ఆర్థిక మంత్రి పదవిని కూడా నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, దేశాధ్యక్షుడు ధర్మన్‌ షణ్ముగరత్నం(Dharman Shanmugaratnam)(67) వాంగ్‌తో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే లూంగ్‌ ప్రభుత్వంలోని మంత్రులు అందరూ వాంగ్‌ సర్కారులోనూ అవే పదవులను చేపట్టనున్నారు. 2025 నవంబర్‌లో సింగపూర్‌ పార్లమెంటు ఎన్నికలు జరిగిన తరువాతే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.

Read Also: Hospital Airdrop : ఆకాశం నుంచి ఊడిపడిన హాస్పిటల్.. ఎలా ?

ఇకపోతే..సుసంపన్న దేశమైన సింగపూర్‌(Singapore)కు సారథ్యం వహిస్తున్న లీ కుటుంబేతర రెండవ నేత వాంగ్. ‘చట్ట ప్రకారం, నా సామర్థం మేరకు ప్రధానిగా నా బాధ్యతలను సర్వకాల సర్వావస్థలందు నమ్మకంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా’ అని వాంగ్ తెలిపారు. వాంగ్ మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ మంత్రి సహాయకునిగా నియుక్తుడైన మాజీ ప్రధాని లీ కూడా వారిలో ఉన్నారు. వాంగ్ యుఎస్‌లో చదువుకున్న ఆర్థికవేత్త.