Site icon HashtagU Telugu

Lakshmi Manchu: మా మంచి లక్ష్మీ.. గ్రామీణ పిల్లల్లో విద్యా వెలుగులు!

Manchu Laxmi

Manchu Laxmi

మంచు లక్ష్మీ.. నటి, యాంకర్ గానే మనకు తెలుసు. కానీ ఆమె ఓ సోషల్ వర్కర్ కూడా. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తూనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె గతకొద్ది రోజులుగా మురికివాడల పిల్లలకు విద్యాబోధనను అందిస్తున్నారు. పెగా టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ సహ వ్యవస్థాపకురాలు అయిన ఆమె యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతితో సమావేశమై ఎంఓయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆలేరు మండలంలోని పటేల్‌ గూడెం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చదువుతోనే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనీ, తనవంతుగా విద్యాదానం చేస్తానని మంచు లక్ష్మీ అన్నారు.