Koovagam Festival: ‘హిజ్రాల’ పెళ్లిని చూతము రారండి!

చెన్నై రాష్ట్రంలో ప్రతి ఏటా చిత్తరై మాసంలో కూత్తాండవర్ ఉత్సవాలు జరుగుతాయి.

చెన్నై రాష్ట్రంలో ప్రతి ఏటా చిత్తరై మాసంలో కూత్తాండవర్ ఉత్సవాలు జరుగుతాయి. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఉత్సవాలు జరగలేదు. అయితే ఈ నెల 6 నుండి ఉత్సవాలు జరగడంతో ప్రజలు చాలా ఉత్సహంగా పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాల్లో చివరి మూడు మూడు రోజులు పాటు హిజ్రాలు కూత్తాండవర్ ఉత్సవాల్లో పాల్గొంటారు. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రం కళ్లకురిచ్చి జిల్లా ఉలందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువుదీరిన కూత్తాండవర్ హిజ్రాలకు ఆరాధ్యుడు అనే విషయం తెలిసిందే.అయితే ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టమైన హిజ్రాల పెళ్లి సందడి నేడు అత్యంత వేడుకగా జరగనుంది.ఈ వేడుక కోసం హిజ్రాలు కువాగం వైపుగా పోటెత్తుతున్నారు.దేశవిదేశాల నుండి ఇక్కడకు తరలివస్తుంటారు. ఆదివారం సాయంత్రం నుంచి ఉత్సవాల్లో భాగంగా హిజ్రాలకు ఫ్యాషన్ షో,సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలిరోజు ఓ సంఘం నేతృత్వంలో మిస్ కూవాగం పోటీలు అర్థరాత్రి వరకు నిర్వహించారు.మరో సంఘం నేతృత్వంలో సోమవారం అందాల పోటీలు,సాంస్కృతిక వేడుకలు జరిగాయి.ఈ ఉత్సవాలపై చెన్నై హిజ్రాల సంఘం కన్వీనర్ సుధా మాట్లాడుతూ…డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తమకు గుర్తింపు పెరిగిందన్నారు.తమ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పథకాల్ని అందజేస్తోందన్నారు.స్థానిక ఎన్నికల్లోనూ తమకు ప్రాధాన్యతను ఇచ్చారని గుర్తు చేశారు.అందుకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఆదివారం జరిగిన మిస్ హిజ్రా పోటీల్లో తమలోని ప్రతిభను చాటుకున్నారు.

మిస్ హిజ్రా గా చెన్నై కు చెందిన సాధన ఎంపికైంది.మోడల్స్ కు, అందగత్తెలకు తామేమీ తీసి పొమ్మన్నట్టుగా హిజ్రాలు సింగారించుకుని మిస్ హిజ్రా కిరీటం కోసం పోటీ పడ్డారు.150 మంది హిజ్రాలు వాయ్యారాల్ని ఒలకబోస్తూ ర్యాంప్ పై తొలి రౌండ్లో అలరించారు.వీరిలో 50 మంది రెండో రౌండ్ కు అర్హత సాధించారు.చివరకు ఫైనల్ రౌండ్ కు ఐదుగురు ఎంపికయ్యారు.వీరికి ఎయిడ్స్ అవగాహన,తమిళ సంస్కృతి సంప్రదాయాల గురించి,జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి పలు ప్రశ్నల్ని సంధించారు.ఇందులో విజేతలుగా చెన్నైకు చెందిన సాధన మిస్ హిజ్రా కిరీటాన్ని సొంతం చేసుకుంది.రెండు,మూడు స్థానాలను చెన్నైకు చెందిన మధుమిత,ఎల్సాలు కైవసం చేసుకున్నారు.వీరికి నగదు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్మాడి,ఎంపి తిరుచ్చి శివ,నటుడు సూరి, నటి నళిని,హిజ్రా సంఘం నేత సుధా తదితరులు పాల్గొన్నారు. ఇక మిస్ కూవాగం పేరిట హిజ్రాలకు మరో పోటీ సోమవారం రాత్రి నుండి మంగళవారం వేకువజాము వరకు జరిగింది.తదుపరి హిజ్రాల పెళ్లి వేడుక కార్యక్రమం నేడు కూవాగం లో జరగనుంది.

ఉత్తమ హిజ్రా కు స్టాలిన్ అవార్డు..

సామాజిక సేవతో పాటుగా తనలాంటి వారిని ఆదరించి,వారికి అండగా నిలబడుతూ వస్తున్న విల్లుపురానికి చెందిన హిజ్రా మర్లిమాను ముఖ్యమంత్రి స్టాలిన్ సత్కరించారు.ఉత్తమ హిజ్రా అవార్డుతో పాటుగా లక్ష రూపాయల నగదు ప్రోత్సహన్ని సచివాలయం వేదికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గీతా జీవన్,డీఎంకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు పాల్గొన్నారు.