ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది. దీనికి కారణం దక్షిణ కొరియా అంటూ మండిపడింది. కోవడ్ వైరస్ ను కరపత్రాల ద్వారా ఉత్తరకొరియాలోకి వ్యాపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రసంగంలో మాట్లాడిన ఆమె..తన సోదరుడు కిమ్ జ్వరం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు చెప్పింది. అయితే ప్రజల కోసం ఆయనకున్న ఆందోళన వల్ల ఒక్కక్షణమైనా బెడ్ పై విశ్రాంతి తీసుకోలేదని చెప్పుకొచ్చింది.
కాగా కిమ్ సోదరి దక్షిణ కొరియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. వైరస్ ను ప్రవేశపెట్టే కరపత్రాలను మా రిపబ్లిక్ లోకి పంపే పనిని శత్రువులు మానుకోవాలని హెచ్చరించింది. ఇది కొనసాగిస్తే…వైరస్ ను మాత్రమే కాకుండా దక్షిణ కొరియా అధికారులను కూడా నిర్మూలించేలా ప్రతిస్పందిస్తాం అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. కాగా కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారు…జ్వరానికి కారణమేంటని మాత్రం పేర్కొనలేదు. కాగా మరోవైపు ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.