SP Balasubrahmanyam : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచిపెట్టి నేటికీ సరిగ్గా మూడేళ్లు. 2020 సెప్టెంబరు 25న ఆయన 74 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. తెలుగు, దక్షిణాది సినీ సంగీత ప్రపంచంపై బాలు చెరగని ముద్ర వేశారు. బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. వాస్తవానికి ఆయన సింగింగ్ స్టార్ గా రాత్రికి రాత్రి మారలేదు. గాయకుడిగా కెరీర్ ప్రారంభించాక.. నేరుగా పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం బాలుకు రాలేదు. అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోల కోసం పాడే ఛాన్స్ మాత్రమే వచ్చింది. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. ఆనాడు ఎన్టీఆర్, ఏన్నార్ లకు అమర గాయకుడు ఘంటసాల తప్ప ఎవరు పాడినా.. ప్రేక్షకులు అంగీకరించేవారు కాదు. అయినా కొన్ని సినిమాల్లో ఘంటసాలతో గొంతు కలిపి పాడే అవకాశాలు బాలుకు వచ్చాయి. ప్రతిరాత్రి వసంత రాత్రి.. ప్రతిగాలి పైర గాలి.. అంటూ ‘ఏకవీర’ మూవీలో ఘంటసాల తో బాలు ఆలపించిన గానం నేటికీ ఎవరూ మరువలేదు.
Also read : Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు
‘శంకరాభరణం’ సినిమాతో..
ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారితో బాలు శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం.
Also read : India – Gold Medal : ఆసియా గేమ్స్ లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్
ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు..
ఈ విధంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాల సుబ్రహ్మణ్యానికే చెల్లింది. గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించారు బాలు. నాలుగు దశాబ్దాల్లో…11 భాషల్లో 40వేల పాటలు పాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు బాలు. ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను బాలు అందుకున్నారు. చనిపోయే కొన్ని నెలల ముందే.. ఆయన నెల్లూరిలోని తన ఇంటిని శంకరాచార్య పీఠానికి (SP Balasubrahmanyam) రాసిచ్చారు.