Site icon HashtagU Telugu

KCR Secret Operation : కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్..నిజమెంత..?

KCR Secret Operation

Kcr

తెలంగాణ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్ (KCR Secret Operation) మొదలుపెట్టారా..? రాబోయే ఎన్నికల్లో (2023 Telangana Elections) ఈ సీక్రెట్ ఆపరేషన్ తో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ని గల్లంతు చేయబోతున్నాడా..? అందుకే బిఆర్ఎస్ (BRS) లోని కీలక నేతలకు టికెట్ ఇవ్వలేదా..? రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు (KCR Hat Trick Victory) పక్క వ్యూహం తో కేసీఆర్ ముందుకు వెళ్తున్నాడా..? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వ్యూహాలను కనిపెట్టలేకపోతుందా..? కాంగ్రెస్ తాను తీసుకున్న గోతులో తానే పడబోతుందా..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే మాట్లాడుకుంటున్నారు.

రాజకీయాల్లో ఎప్పుడు ఒకేలా ఉంటె పైకి ఎదగాలేం. సమయాన్ని బట్టి ఆలోచనలు చేయాలి..ఈ విషయంలో కేసీఆర్ దిట్ట. ఎప్పుడు ప్రతిపక్షాలను కలుపుకోవాలో..ఎప్పుడు పక్కకు పెట్టాలో..బాగా తెలుసు. మునుగోడు ఎన్నికల సమయంలో CPI , CPM పార్టీలతో పొత్తు పొట్టుకొని అక్కడ విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఆ పార్టీల ఊసే లేకుండా బరిలోకి దిగుతున్నారు. అంతే కాదు ఎన్నికల బరిలో సీక్రెట్ ఆపరేషన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.

రెండుసార్లు విజయం సాధించిన కేసీఆర్..హ్యాట్రిక్ కొట్టడమే కాదు మెజార్టీ స్థానాల్లో గెలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. మొదట్లో 90 నుండి 100 మందితో కూడిన లిస్ట్ ను కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం అందరికి షాక్ అయ్యేలా ఏకంగా 115 స్థానాల కు సంబదించిన 115 అభ్యర్థులను ప్రకటించి ..మరో నాల్గు స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు.

2014 లో 63 సీట్లు గెలిచిన గులాబీ పార్టీ.. 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది. తొలిసారి కంటే 25 సీట్లు ఎక్కువే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది , టిడిపి నుండి ఇద్దరు , ఇండిపెండెంట్ నుండి ఒక్కక్కరు చొప్పున ఎమ్మెల్యేల లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం బిఆర్ఎస్ బలం 104 కు చేరింది. ఈసారి గత రెండు సార్ల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని కేసీఆర్ మొదటి నుండి డిమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈసారి 95 నుండి 105 సీట్లలో విజయం సాధిస్తామని అంటున్నారు.

అయితే ఈసారి కూడా సిట్టింగ్ స్థానాలకే (KCR Sitting MLAs) మొగ్గు చూపించడం..పార్టీలో కీలక నేతలకు టికెట్ ఇవ్వకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. కీలక నేతలకు టికెట్ ఇవ్వకుండా..వారిని కాంగ్రెస్ లో చేర్పించి..ఎక్కడైతే బిఆర్ఎస్ తక్కువ ఉందొ.. అక్కడ కాంగ్రెస్ బరిలో నిలిపి.. కాంగ్రెస్ నుండి గెలిచినా తర్వాత మళ్లీ బిఆర్ఎస్ లో చేర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసాడని అంటున్నారు.

దీనికి ఉదాహరణే చెన్నూర్ ఎమ్మెల్యే.. మళ్లీ టికెట్ పొందిన బాల్క సుమన్ (MLA Balka Suman) చేసిన ఆరోపణలు. ‘నియోజకవర్గంలో తిరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను నాయకులను ఎవ్వరూ ఏం అనకండి.. వాళ్లు మనవాళ్లే.. మేమే కొంత మందిని ఎంపిక చేసి కాంగ్రెస్ లోకి పంపినం.. వాళ్లు బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారు. గెలిచినా బీఆర్ఎస్ లోకే వస్తారు. అది మా గేమ్ ప్లాన్.. ఎవరికీ చెప్పకండి’ అంటూ సంచలన నిజాన్ని బయటపెట్టారు. బాల్క సుమన్ చెప్పిందాన్ని ఏమాత్రం లైట్ తీసుకోవడాన్ని అంటున్నారు.

ఇటీవల కేసీఆర్ అసెంబ్లీ టికెట్ల ప్రకటన సందర్భంగా ఆయన వెనుకనే బాల్క సుమన్ ఉన్నారు. కేసీఆర్ ఆ లిస్ట్ తోపాటు పలు కీలక పత్రాలు అందజేశారు. సో ఈ వ్యూహంలో బాల్కసుమన్ కూడా ఉన్నాడని.. ఆయన చెప్పేవన్నీ కేసీఆర్ చేస్తున్నాడని.. కాంగ్రెస్ లోకి కేసీఆర్ కోవర్టులను పంపాడని కాంగ్రెస్ అధిష్టానం దీనిని గమనించాలని కాంగ్రెస్ అభిమానులు అంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడుతుందని, గత ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ నుండి గెలిచి..బిఆర్ఎస్ లో చేరారో..మళ్లీ ఈసారి కూడా అలాగే అవుతుందని వారంతా వాపోతున్నారు. మరి కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కోవర్టులు ఎవరో..? త్వరలో చేరబోయేది బిఆర్ఎస్ కోవర్టులేనా..? అసలు ఇది నిజామా..కదా..? నిజంగానే కేసీఆర్ ఆపరేషన్ చేస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version