Karachi Bakery: హైదరాబాద్‌లోని కరాచీ బేకరీ ప్రస్థానం 1953లో మొదలైంది. మొదట్లో మోజామ్ జాహీ మార్కెట్‌లో బేకరీని ప్రారంభించారు. కాలక్రమేణా, ఇది బెంగళూరు, చెన్నై మరియు ఢిల్లీతో సహా ఇతర భారతీయ నగరాలకు విస్తరించింది. ప్రస్తుతం కరాచీ బేకరీ దాని ఉత్పత్తులను యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా అనేక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న బేకరీలలో కరాచీ బేకరీ స్థానం ప్రత్యేకం. అందుకే ఇప్పుడు కరాచీ బేకరీ టేస్ట్ అట్లాస్ 150వ జాబితాలో చేరింది. 150 అత్యంత ప్రసిద్ధి చెందిన డెజర్ట్ ప్రదేశాలలో స్థానం దక్కించుకుంది. 150 ప్రత్యేకమైన డెజర్ట్ జాబితాలో హైదరాబాద్ కరాచీ నిలవడం గమనార్హం. టేస్ట్ అట్లాస్ ఆహార ప్రియుల కోసం ట్రావెల్ గైడ్ గా పనిచేస్తుంది, కరాచీ బేకరీ ఫ్రూట్ బిస్కెట్‌లను ప్రపంచవ్యాప్తంగా 29వ అత్యుత్తమ డెజర్ట్‌గా నిలిచిందని టేస్ట్ అట్లాస్ పేర్కొంది. సిగ్నేచర్ ప్రొడక్ట్‌గా బిస్కెట్‌లకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంది. ఈ బిస్కెట్లు ఎంతో సున్నితంగా మరియు రుచిగా ఉంటాయి. క్యాండీడ్ ఫ్రూట్‌తో ఈ బిస్కెట్స్ ని తయారు చేస్తారు.
టేస్ట్ అట్లాస్ జాబితాలో నిలిచిన డెజార్ట్స్:
కయానీ బేకరీ, పూణే (18వ స్థానం)
కెసి దాస్, కోల్‌కతా (25)
ఫ్లూరీస్, కోల్‌కతా (26)
బలరామ్ ముల్లిక్ & రాధారామన్ ముల్లిక్, కోల్‌కతా (37)
కె రుస్తోమ్ & కో, ముంబై (49)
కురేమల్స్ కుల్ఫీ, న్యూఢిల్లీ (67)
ప్రకాష్ కీ మషూర్ కుల్ఫీ, లక్నో (77)
చితాలే బంధు, పూణే (85)
జలేబీ వాలా, న్యూఢిల్లీ (93)
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ స్థలాల పూర్తి జాబితా టేస్ట్ అట్లాస్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కావాలంటే ఆ వెబ్ సిట్ కి వెళ్లి విజిట్ చేయవచ్చు.