World IVF Day : ఇవాళ (జులై 25) వరల్డ్ ఐవీఎఫ్ డే. ఐవీఎఫ్ ఫుల్ ఫామ్.. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్. ఐవీఎఫ్ అనేది ఆధునిక కృత్రిమ గర్భధారణ పద్దతి. సహజంగా ప్రయత్నించినా సంతానం కలగకపోతే.. ఐవీఎఫ్ మార్గాన్ని అనుసరించవచ్చు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఐవీఎఫ్ చికిత్స ఖర్చు దాదాపు లక్ష నుంచి 3 లక్షల దాకా ఉంటుంది. భారత ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన అసిస్టెట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) చట్టం ప్రకారం.. 21 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు మాత్రమే ఐవీఎఫ్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవడానికి అర్హులు.ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం(World IVF Day) సందర్భంగా ఐవీఎఫ్ ద్వారా సంతాన భాగ్యం పొందిన సెలబ్రిటీ జంటల(IVF Celebrities) గురించి తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
సన్నీ లియోని- డేనియల్ వెబర్
సన్నీ లియోని, డేనియల్ వెబర్ దంపతులు 2018లో సరోగసీ ద్వారా ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులయ్యారు. అంతకుముందు వారు ఒక పాపను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం వారికి మొత్తం ముగ్గురు పిల్లలు. వారి పేర్లు నిషా కౌర్ వెబర్, అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్.
జాన్ అబ్రహం- ప్రియా రుంచల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ఆయన సతీమణి ప్రియా రుంచల్ ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.
ఫరా ఖాన్- శిరీష్ కుందర్
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ – శిరీష్ కుందర్ దంపతులు 2008లో ఐవీఎఫ్ చికిత్స ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఈవిషయాన్ని వారు బహిరంగంగా ప్రకటించారు. ఐవీఎఫ్ ద్వారా పిలలను కనే సమయానికి ఫరా ఖాన్ వయసు 43 ఏళ్లు.
Also Read :Jai Hanuman : జై హనుమాన్.. చిరు కన్విన్స్ అయితే మాత్రం..!
కరణ్ జోహర్
పెళ్లి కాకుండానే తండ్రి అయ్యారు బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహర్. ఆయన ఐవీఎఫ్ ద్వారానే ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారారు.
ఏక్తా కపూర్
ఏక్తా కపూర్ వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ ఐవీఎఫ్ చికిత్స ద్వారా సరోగసీ పద్దతిలో ఒక మగబిడ్డకు తల్లి అయింది. 2019 జనవరి 27న ఆమెకు బిడ్డ కలిగింది. ఆ బిడ్డ పేరు రవీ కపూర్.
షారుక్ ఖాన్- గౌరీ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, గౌరీఖాన్ దంపతులకు మూడో బిడ్డ ఐవీఎఫ్ చికిత్స ద్వారానే కలిగింది. ఆ బిడ్డ పేరు అబ్రామ్. నెలలు నిండకుండానే వారికి ఈ బిడ్డ కలిగాడు.
ఇషా అంబానీ- ఆనంద్ పిరమాల్
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ కూడా ఐవీఎఫ్ ద్వారానే కవలలకు జన్మనిచ్చింది. కొడుకు కృష్ణ, కుమార్తె ఆదియాలకు ఐవీఎఫ్ ద్వారానే జన్మనిచ్చానని ఆమె వెల్లడించారు. ఇందులో దాచుకోవాల్సిన విషయమేం లేదన్నారు.