Cricketer Amir Hussain: రెండు చేతులు లేకపోయినా బ్యాటింగ్ చేస్తూ..

జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన అమిర్ హుస్సేన్‌ విధి రాత‌ను ఎదిరించి క్రికెట్‌లో రాణిస్తున్నాడు. రెండు చేతులు లేకున్నా మెడ‌ సాయంతో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్నాడు. నిజానికి అమిర్‌ పుట్టిక‌తోనే దివ్యాంగుడు కాదు.

Published By: HashtagU Telugu Desk
Cricketer Amir Hussain

Cricketer Amir Hussain

Cricketer Amir Hussain: జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన అమిర్ హుస్సేన్‌ విధి రాత‌ను ఎదిరించి క్రికెట్‌లో రాణిస్తున్నాడు. రెండు చేతులు లేకున్నా మెడ‌ సాయంతో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్నాడు. నిజానికి అమిర్‌ పుట్టిక‌తోనే దివ్యాంగుడు కాదు. 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ తన ఎనిమిదేళ్ల వయసులో రెండు చేతులను కోల్పోయాడు.

అమిర్ కుటుంబం వడ్రంగి పని చేసేవారు. వాళ్లకు సొంతంగా కర్రల మిల్ ఉన్నది. ఒక‌రోజు అమిర్ అన్న‌య్య‌కు లంచ్ బాక్స్ ఇచ్చేందుకు వాళ్ళ మిల్ కు వెళ్లాడు. అనుకోకుండా అతడి జాకెట్ మిషిన్‌లో ఇరుక్కుపోయింది. దాంతో అమిర్ రెండు చేతులు పోగొట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశకు లోనవుతారు. జీవితంలో ఏం సాధించలేమని కుంగిపోతారు. కానీ ఎప్పటికైనా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆశ మాత్రం అతని నుంచి దూరం కాలేదు. రెండు చేతులు లేకున్నా సాధ‌న చేయ‌డం మొద‌లెట్టాడు. చేతులు లేకుండా బ్యాటు ప‌ట్టుకోవ‌డం చాలా కష్ట‌మ‌య్యేది. అప్పుడు మెడ‌ సాయంతో బ్యాటు హ్యాండిల్ ప‌ట్టుకుని ఆడటం ప్రారంబించాడు.

ప్ర‌స్తుతం అమిర్ జ‌మ్ముక‌శ్వీర్ పారా క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. పైగా కాళ్ల సహాయంతో బౌలింగ్ చేస్తూ అందర్నీ అభ్హురపరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమిర్ వీడియో చూసిన‌వాళ్లంతా నీ ప‌ట్టుద‌ల‌, అంచంచ‌ల‌మైన ఆత్మ‌విశ్వాసానికి స‌లాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఆ వీడియో చూసిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అమిర్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.ఏదో ఒక రోజు అమిర్‌ని క‌లిసి అతడి పేరుతో ఉన్న జెర్సీని బ‌హుమ‌తిగా తీసుకుంటానని సచిన్ చెప్పాడు.

Also Read: Deve Gowda: లోక్‌సభ ఎన్నికలకు దూరంగా మాజీ ప్రధాని దేవెగౌడ

  Last Updated: 13 Jan 2024, 10:16 PM IST