Site icon HashtagU Telugu

Jagadeeshwar Goud : జగదీశ్వర్ గౌడ్

Jagadeeshwar Goud

Jagadeeshwar Goud

Jagadeeshwar Goud : ప్రజా సేవా తత్పరతకు, రాజకీయ పరిణతికి మారుపేరైన వి. జగదీశ్వర్ గౌడ్ (V. Jagadeeshwar Goud) తెలంగాణలోని హైదరాబాద్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పుట్టి పెరిగారు. ఆయన చిరునామా శేరిలింగంపల్లి కావచ్చు గాని ఆయన అసలు చిరునామా సామాజిక సంక్షేమ కార్యకలాపాలే. 22 సంవత్సరాలుగా నిరంతరం సామాజిక సంక్షేమాలు కొనసాగిస్తున్న జగదీశ్వర్ గౌడ్ మాజీ కేంద్రమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ కీర్తిశేషులు శ్రీ డాక్టర్ మల్లికార్జున్ బాబాయి , నల్లగండ్ల గ్రామ సర్పంచిగా పనిచేసిన కీర్తిశేషులు శ్రీ హరి శంకర్ గారి కుమారుడు.

We’re Now on WhatsApp. Click to Join.

బీకాం, ఎంబీఏ, ఎల్.ఎల్.బి పట్టాలు సాధించి అత్యున్నత విద్యావంతునిగా పేరుగాంచిన జగదీశ్వర్ (Jagadeeshwar Goud) 2001 నుంచి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ శేరిలింగంపల్లిలో అనునిత్యం వృద్ధులు, యువజనులు, మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారు. 2001లో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ అనే ఎన్జీవో సంస్థను స్థాపించి సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2002లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2007లో గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీనగర్ కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్ గా ఎన్నికయ్యారు. 2008లో కేంద్ర యువజన శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ నెహ్రూ యువ కేంద్రానికి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా ఎన్నికయ్యారు. తన సేవా కార్యక్రమాలతో అశేష ప్రజాదరణ కలిగిన నాయకునిగా పేరు గడించి 2014లో శేర్లింగంపల్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హఫీజ్ పేట డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2016లో శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి మాదాపూర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.

తరాల రాజకీయ వారసత్వం, జగదీష్ గౌడ్ కుటుంబానికి తరగని ప్రజాదరణకు పెన్నిధిగా మారింది. ఆయన సతీమణి పూజితా జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud) కూడా 2016లో హఫీజ్పేట్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2017లో జగదీశ్వర్ గౌడ్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు.

సుదీర్ఘకాలం కార్పొరేటర్ గా అపార అనుభవం సాధించి, జిహెచ్ఎంసి లోని 150 డివిజన్లలో క్షేత్రస్థాయి పరిశీలన గావించి, ప్రజల సమస్యలను, వాటి మూలాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న రాజకీయ నాయకులు జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud). తన నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో ఇంటింటికీ గడపగడపకూ స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను, వారి మౌలిక అవసరాలను గురించి సర్వే చేసి ఒక సంపూర్ణ అవగాహనతో ఇప్పుడు శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగదీశ్వర్ గౌడ్ ఎన్నికల బరిలో నిలబడ్డారు.

 

పుట్టిన ఊరు: నల్లగండాల గ్రామం, శేరిలింగంపల్లి.
పాఠశాల: స్టాన్స్ హై స్కూల్ భెల్.
డిగ్రీ కళాశాల: B.Com బద్రుక.
MBA: సోదరి నివేదిత రెడ్ హిల్స్.
న్యాయవిద్య: పెండకేంటి న్యాయ కళాశాల.

Also Read:  Ponguleti Srinivasa Reddy : డబ్బును నమ్ముకొని గెలుస్తానని పువ్వాడ కలలు కంటున్నాడు – పొంగులేటి