Uri Attack 2016 :ఉరీ దాడికి ఆరేళ్లు.. ఏ ఒక్క భారతీయుడూ మర్చిపోలేని ఘటన..!!

ఉరీ దాడికి నేటికి సరిగ్గా ఆరేళ్లు. సెప్టెంబర్ 18, 2016 ఉదయం..జమ్మూ కశ్మీర్ లోని ఉరీలోఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన 4గురు ఉగ్రవాదులు దాడి చేశారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 08:58 AM IST

ఉరీ దాడికి నేటికి సరిగ్గా ఆరేళ్లు. సెప్టెంబర్ 18, 2016 ఉదయం..జమ్మూ కశ్మీర్ లోని ఉరీలోఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన 4గురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దారుణ ఘటనను ఇప్పటికీ ఏ ఒక్క భారతీయుడూ మరిచిపోలేదు. ఈ ఉగ్రదాడిలో సైన్యంలో 19మంది సైనికులు తూటాలకు బలయ్యారు. కానీ పది రోజుల్లో భారత సైన్యం తమ సైనికుల త్యాగానికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది.

భారత సైన్యానికి చెందిన ప్రత్యేక బృందం POKలోకి ప్రవేశించింది. ఉగ్రవాదులను హతమార్చడమే కాదు…వారి స్థావరాలను కూడా ధ్వంసం చేసి…సురక్షితంగా తిరిగి వచ్చింది. భారత సైన్యం చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ కు పాకిస్తాన్ కూడా ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ధృవీకరించలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాని దౌర్జన్యాన్ని చూసిన పాకిస్తాన్ భారత్ సర్జికల్ స్ట్రైక్ ను అంగీకరించింది.

సెప్టెంబరు 18న ఉదయం 5.32 గంటల ప్రాంతంలో ఉరీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ 4 ఉగ్రవాదులు పాక్ సైన్యం సహాయంతో నియంత్రణ రేఖ వెంబడి భారత సరిహద్దులోకి ప్రవేశించారు.ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ సమీపంలోకి చేరుకోగానే గ్రెనేడ్‌లు విసిరారు. క్యాంపులో మంటలు చెలరేగాయి. భారత ఆర్మీ జవాన్లు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ఆరు గంటలకు పైగా కొనసాగింది. ఉగ్రవాదుల దుశ్చర్యతో భారత సైన్యంలోని 19 మంది సైనికులు అమరులయ్యారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు కూడా మరణించారు.

ఈ ఉగ్రతూటాలు సైనికుల ఛాతీలోనే కాదు దేశప్రజలందరి ఛాతీలో ఆగ్రహావేశాలు రగిలించేలా చేశాయి. పాక్ దుర్మార్గపు చర్యకు సమాధానం చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. అదే జరిగింది. ఉరీ దాడి జరిగిన సరిగ్గా 10 రోజుల తర్వాత పాక్ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పింది భారత సైన్యం. సైన్యంలో ప్రత్యేక కమాండోలను గుర్తించారు. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ గురించి వారికి సమాచారం అందించారు. సైన్యానికి అవసరమైన అన్ని మార్గదర్శకాలను NSS అజిత్ దోవల్ జారీ చేశారు. సెప్టెంబరు 28-29 అర్ధరాత్రి, భారత సైన్యం దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపల PoKలోకి ప్రవేశించింది. 40 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వారి రహస్య స్థావరాలను నాశనం చేసింది. సురక్షితంగా తిరిగి వచ్చింది భారత సైన్యం. భారత సైన్యం చేసిన ఈ గొప్ప పనికి ఒక్క భారతీయులే కాదు, యావత్ ప్రపంచమూ అభినందించింది.