BJP Formation Day : బీజేపీ 45 వసంతాలు.. కమలదళం ఎలా ఏర్పాటైందో తెలుసా ?

1980 ఏప్రిల్ 5, 6 తేదీలలో జనతా పార్టీలోని జనసంఘ్(BJP Formation Day) విభాగం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది.

Published By: HashtagU Telugu Desk
Bjp Formation Day Bjp 45 Years Janata Party Jana Sangh Ram Janmabhoomi Uttar Pradesh

BJP Formation Day : ఒకప్పుడు కనీసం 20 లోక్‌సభ స్థానాలు కూడా గెలవలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. కాలం మారడం కాదు.. కష్టం ఫలించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల దీర్ఘకాలిక విజన్ విజయవంతమైంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లు దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అంకితభావంతో చేసిన పని వల్లే బీజేపీ ఈరోజు బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. బీజేపీ ప్రయాణం సరిగ్గా 45 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అద్వానీ, వాజ్‌పేయిల చొరవతో 1980 ఏప్రిల్ 6న ఆ పార్టీ జర్నీ మొదలైంది. ఇంతకీ బీజేపీ ఎలా ఏర్పాటైంది ? ఏ పరిస్థితుల నడుమ ఏర్పాటైంది ? ఏ లక్ష్యాలతో ఏర్పాటైంది ?  ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Nithyananda : నిత్యానంద స్వామి లొకేషన్ అదే.. ఎక్కడికీ వెళ్లలేడు !?

జనసంఘ్ వర్సెస్ జనతా పార్టీ

  • 1925 సెప్టెంబరు 27న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్పాటైంది.
  • 1951 అక్టోబరు 21న ఢిల్లీ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ విభాగం జనసంఘ్ ఏర్పాటైంది. దీని వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, బల్‌రాజ్ మధోక్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్.
  • 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసంఘ్ సహా పలు విపక్ష రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి  రాజకీయ వేదికే జనతా పార్టీ.
  • 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీకి 31 సీట్లు వచ్చాయి. అయితే వాటిలో 16 సీట్లు జనసంఘ్‌వే.
  • అప్పట్లో కొందరు జనతా పార్టీ నేతలకు ఆర్ఎస్ఎస్‌లోనూ సభ్యత్వం ఉండేది. ఎందుకంటే వాళ్లందరికీ కొన్ని దశాబ్దాలుగా జనసంఘ్ నేపథ్యం ఉండేది. అందుకే వారు రాజకీయ భవితవ్యం కోసం ఆర్ఎస్ఎస్ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు.
  • జనసంఘ్ నేపథ్యం కలిగిన జనతా పార్టీ సభ్యులు ఒకవేళ ఆర్ఎస్ఎస్‌ను వదలకుంటే, వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని జనతా పార్టీ వర్కింగ్ కమిటీ 1980 ఏప్రిల్ 4న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని జనసంఘ్ సభ్యులు ముందే ఊహించారు.

Also Read :Chessboard Killer : 63 సీరియల్ మర్డర్లు.. ‘చెస్ బోర్డ్ కిల్లర్’ రియల్ స్టోరీ

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో.. 

  • 1980 ఏప్రిల్ 5, 6 తేదీలలో జనతా పార్టీలోని జనసంఘ్(BJP Formation Day) విభాగం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు 3,000 మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. అక్కడే బీజేపీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయిని పార్టీకి అధ్యక్షుడిగా నియమించగా, ఎల్.కె. అద్వానీ, సూరజ్ భాన్, సికందర్ బఖ్త్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
  • ఈ విధంగా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పర్యవేక్షణ, దిశానిర్దేశంలో బీజేపీ ఆవిర్భావం జరిగింది.
  • జనతాపార్టీ ఎన్నికల చిహ్నంగా ‘హల్ధార్ కిసాన్’ ఉండేది. దీంతో  ఆ చిహ్నాన్ని ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది.
  • కొత్తగా ఏర్పాటైన బీజేపీకి ఎన్నికల సంఘం జాతీయ పార్టీ హోదాను మంజూరు చేసింది. దానికి కమలం గుర్తును కేటాయించింది. అంతకుముందు చక్రం, ఏనుగు వంటి ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని బీజేపీ కోరింది. కానీ ఎన్నికల సంఘం అంగీకరించలేదు.
  Last Updated: 06 Apr 2025, 12:34 PM IST