Site icon HashtagU Telugu

Isro Scientists : ఇస్రో శాస్త్రవేత్తల విజయ మంత్రాలివేనట.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !

Isro Scientists says their Success Formula know about it

Isro Scientists says their Success Formula know about it

చంద్రయాన్ -3(Chandrayaan 3) విజయంతో కేవలం మనదేశమే కాకుండా.. ప్రపంచ దేశాల చూపంతా ఇస్రో(Isro) వైపు తిరిగింది. ఇస్రో సాధించిన ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఇండియన్స్ కు.. 10 రోజుల్లోగానే ఆదిత్య ఎల్1(Aditya L1) ప్రయోగంతో మరో ట్రీట్ ఇచ్చింది. మూడు దశల్లో ఆదిత్య ఎల్1 ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి శనివారం(ఆగస్టు2) ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. పీఎస్ఎల్ వీ సీ57 రాకెట్ 1480.7 కిలోల ఆదిత్య ఎల్1 తో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంటోంది. 125 రోజుల్లో ఆదిత్య దాని కక్ష్యను నాలుగుసార్లు పెంచుతుంది. గ్రహణాల సమయంలో కూడా సూర్యుడి(Sun)పై పరిశోధనలకు ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ రాకెట్ ను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నట్లు గతంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు .

అయితే.. ఇంత సక్సెస్ ఫుల్ గా రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల(Isro Scientists) విజయ మంత్రాలేంటి ? ప్రయోగం సక్సెస్ అయితే.. సైంటిస్టులకు ప్రోత్సాహకాలు ఉంటాయా ? అంటే.. లేవు అని చెప్పింది ఓ జాతీయ మీడియా. వాళ్లు చెప్పిన విజయ మంత్రం ఏంటో వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతిరోజూ సాయంత్రం రుచిచూసే మసాలా దోశ, ఫిల్టర్ కాఫీనే వారి విజయ రహస్యాలంట. జాబిల్లిపై చంద్రయాన్-3 విజయం సాధించినందుకు ఇస్రో సైంటిస్టులకు స్పెషల్ ప్రోత్సాహకాలు ఏమీ లేవట. ఈ విషయం చంద్రయాన్-3 మిషన్ కు పనిచేసిన వెంకటేశ్వర శర్మ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు తాము తినే మసాలాదోశ, ఫిల్టర్ కాఫీతోనే ఈ సక్సెస్ సాధించినట్లు సరదాగా చెప్పారు.

గతంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ మాట్లాడుతూ.. తమ సైంటిస్టులు సాధారణ జీవితాన్నే గడుపుతారని తెలిపారు. వాళ్లకెప్పుడు సంపాదనపై ధ్యాస ఉండదని, ఏకాగ్రత అంతా మిషన్ పైనే ఉంటుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని సైంటిస్టుల జీతాలతో పోలిస్తే.. ఇస్రో సైంటిస్టుల జీతాలు 5వ వంతు మాత్రమే ఉంటాయన్నారు.

 

Also Read : Pragyan – 100 Meters Journey : చంద్రుడిపై ప్రజ్ఞాన్ జర్నీ.. కొత్త అప్ డేట్ వచ్చేసింది