Israel Vs Hezbollah : హిజ్బుల్లాతో యుద్ధానికి ఇజ్రాయెల్ సై.. వాట్స్ నెక్ట్స్ ?

పాలస్తీనాలోని గాజా ప్రాంతానికి చెందిన చిన్నపాటి మిలిటెంట్ సంస్థ ‘హమాస్‌తో గతేడాది అక్టోబరు నుంచి పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు మరో బలమైన ప్రత్యర్ధితో తలపడేందుకు రెడీ అవుతోంది.

Published By: HashtagU Telugu Desk
Israel Vs Hezbollah

Israel Vs Hezbollah : పాలస్తీనాలోని గాజా ప్రాంతానికి చెందిన చిన్నపాటి మిలిటెంట్ సంస్థ ‘హమాస్‌తో గతేడాది అక్టోబరు నుంచి పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు మరో బలమైన ప్రత్యర్ధితో తలపడేందుకు రెడీ అవుతోంది. తమ సరిహద్దు దేశం లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థతో తలపడేందుకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ యుద్ధమే మొదలైతే దాదాపు ఆరేడు నెలలు కొనసాగే ముప్పు ఉంది. అందుకే అమెరికా రంగంలోకి దిగింది. హిజ్బుల్లాతో యుద్ధం చేయొద్దని ఇజ్రాయెల్‌ను వారిస్తోంది. ఏ మాత్రం ఆయుధాలు అందని విధంగా గాజా ప్రాంతం సరిహద్దులను మూసేసినా ఇజ్రాయెల్ ఆర్మీతో నేటికీ హమాస్ పోరాడుతోంది. సిరియా, ఈజిప్టు బార్డర్ల నుంచి ఆయుధాలు వచ్చేందుకు మార్గాలను కలిగి ఉన్న లెబనాన్‌లోని హిజ్బుల్లాతో యుద్ధం చేస్తే ఇజ్రాయెల్‌కు ముచ్చెమటలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హిజ్బుల్లా వద్ద కొన్నేళ్ల పాటు యుద్ధం చేసేందుకు సరిపడా ఆయుధాలు ఉన్నాయనే నివేదికలు వస్తున్నాయి.  అందుకే హిజ్బుల్లాతో యుద్ధం చేయొద్దని ఇజ్రాయెల్‌ను(Israel Vs Hezbollah) అమెరికా వారిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

గత ఏడాది అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్‌-హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పరస్పర దాడుల్లో 400 మంది దాకా చనిపోయారు. వాటి మధ్య సీరియస్ వార్ మొదలైతే వేలాది మంది ప్రాణాలు పోవడం ఖాయం. ప్రత్యేకించి లెబనాన్‌లో ప్రాణ నష్టం పెద్దఎత్తున జరిగే రిస్క్ ఉంది. ఇజ్రాయెల్ ముందు జాగ్రత్త చర్యగా లెబనాన్ బార్డర్‌లోని వందలాది గ్రామాలు, పట్టణాలను ఖాళీ చేయించింది. అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించింది. ఈవిధమైన ఏర్పాటును లెబనాన్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్థికంగా లెబనాన్ చాలా బలహీన స్థితిలో ఉంది. అంతమందిని ఇతర ప్రాంతాలకు తరలించి, వారి జీవనానికి సరిపడా ఏర్పాట్లు చేసే స్థితిలో లెబనాన్ లేదు. అమెరికా నుంచి ప్రతి సంవత్సరం అందే ఆర్థిక సహాయక ప్యాకేజీ అండతో ఇజ్రాయెల్ ఇలాంటి ఏర్పాట్లన్నీ సునాయాసంగా చేయగలుగుతోంది. యుద్ధాల విషయంలో దూకుడుగా ముందుకు సాగుతోంది.

Also Read :Navagraha : నవగ్రహాల ఆశీస్సులు కావాలా ? ఇలా చేయండి

హిజ్బుల్లా వద్ద అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. లెబనాన్‌పై  ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్దానికి దిగితే.. హిజ్బుల్లా తన ఆయుధాలన్నీ ప్రయోగించేందుకు సిద్దమవుతుంది. ఇజ్రాయెల్ రాజధాని, ఓడరేవులపై భీకర దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పర్యాటకపరంగా, వాణిజ్యపరంగా ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది. లెబనాన్‌తో యుద్ధం జరిగితే..భారీ నష్టాన్ని మూటకట్టుకునేందుకు ఇజ్రాయెల్ రెడీ కావాల్సి ఉంటుంది. అక్కడి వ్యాపారాలు కూడా కుదేలయ్యే రిస్క్ ఉంది. లెబనాన్‌కు ఆయుధాలతో ఆర్థికపరంగా సాయం చేసేందుకు ఇరాన్, సిరియా, ఇరాక్, యెమన్ దేశాలు మొగ్గుచూపుతాయి. ఆయా దేశాల సైన్యాలు, మిలిటెంట్లు లెబనాన్‌లోకి వచ్చి.. ఇజ్రాయెల్ ఆర్మీతో తలపడే అవకాశాలు సైతం ఉన్నాయి.

Also Read :Search On Mobile : గూగుల్ క్రోమ్​లో 5​ కొత్త ‘సెర్చ్‌’ ఫీచర్స్

  Last Updated: 30 Jun 2024, 02:20 PM IST