Government Employees : కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు అంత చులకనా..?

సర్కార్ కొలువులో జీతాలు గట్టిగా ఇస్తారు..పని చేసిన చేయకపోయినా అడిగే వారు ఉండరు. ఏ టైం కు ఆఫీస్ కు వెళ్లిన పట్టించుకునే వారు కానీ అడిగే వారు కానీ ఉండరు

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 11:19 AM IST

ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ సర్కార్ కొలువు (Government Job) అనేది రాదు..ఒక్కసారి సర్కార్ కొలువు వస్తే వారి జన్మధన్యం అయినట్లే..సర్కార్ కొలువు కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తూ..కష్టపడుతుంటారు. ఒక్కసారి వచ్చిందా..ఇక జీవితంలో వెనక్కు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకా అంతా..అంటే సర్కార్ కొలువులో జీతాలు గట్టిగా ఇస్తారు..పని చేసిన చేయకపోయినా అడిగే వారు ఉండరు. ఏ టైం కు ఆఫీస్ కు వెళ్లిన పట్టించుకునే వారు కానీ అడిగే వారు కానీ ఉండరు. ఒకవేళ అడిగిన మీకు తెలియంది ఏముంది సార్..అంటూ ఒక్క మాట చెప్పగానే అంత సైలెంట్. అందుకే ప్రభుత్వ ఆఫీస్ లలో , ప్రభుత్వ స్కూల్స్ లలో , ప్రభుత్వ హాస్పటల్ ఇలా ఏదైనా సరే ప్రభుత్వ కొలువు అంటే మనసు పారేసుకుంటారు.

ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో ప్రభుత్వ ఉద్యోగులంతా (Government Employees) ఇలాగే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరు కూడా టైంకు ఆఫీస్ కు కానీ హాస్పటల్ కు కానీ , స్కూల్స్ కు కానీ ఇలా ఎక్కడ కూడా రావడం లేదు. సీఎం రేవంత్ ఓ పక్క 16 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాం..మా మంత్రులు , ఎమ్మెల్యేలు ఎవరు కూడా సరిగా నిద్ర కూడా పోకుండా కష్టపడుతున్నాం అని చెపుతుంటే..ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కనీసం నాల్గు గంటలు కూడా పనిచేయడం లేదు. అంటే వీరిని అడిగే వారు ఎవరు లేకపోవడం తో ఇష్ట రాజ్యం అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవాలని వెళ్లిన బాధితులు ఉదయం 8 గంటలకే ఆఫీసుల వద్దకు వచ్చి ఎదురుచూస్తుంటారు. కానీ ఉద్యోగులు మాత్రం ఉదయం 11 గంటలకు , 11 : 30 నిమిషాలకు తీరిగ్గా ఆఫీస్ లకు వస్తున్నారు. వచ్చి ఏమైనా వెంటనే తమ పని మొదలుపెడతారా అంటే అది లేదు..ఫోన్లలో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఇక భోజన సమయానికి ఏదో హడావిడి చేసి..భోజనానికి వెళ్తుంటారు. తిరిగి 3 గంటలకు వచ్చి..ఓ గంట సేపు ఉండి..4 కాగానే బై బై చెప్పి వెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవాలంటే బాధితులు కనీసం వారం రోజులు తిరగాల్సిందే. ఆ పని జస్ట్ 2 నిమిషాల్లో అవుతుంది..కానీ వారు మాత్రం వారం తిప్పించుకుంటారు. అది కూడా చేతిలో మాములు పెడితేనే..

We’re now on WhatsApp. Click to Join.

ఇక ప్రభుత్వ హాస్పటల్స్ విషయానికి వస్తే…డాక్టర్ ఎప్పుడు వస్తాడో..ఎప్పుడు వెళ్తాడు కనీసం ఆ హాస్పటల్ లో పనిచేసేవారికి కూడా తెలియదు. ఏదైనా ప్రమాదమే ప్రభుత్వ హాస్పటల్ కు వెళ్తే నర్స్ తో చికిత్స చేయించుకొని..ప్రవైట్ హాస్పటల్ కు వెళ్లి మిగతా వైద్యం చేసుకోవాల్సిందే..ఆలా ఉంది అక్కడి పరిస్థితి. ప్రభుత్వ హాస్పటల్స్ లలో ఏ డాక్టర్ కూడా టైం కు రాడు..వచ్చిన వెంటనే పేషంట్లను చూడరు..ఏదో ఆపరేషన్ అని , లేదా మీటింగ్ అని చెప్పి వెళ్తారు. ఇలా ఈరోజు కాదు గత కొన్నేళ్లుగా ఇదే నడుస్తున్నదే. మరి వీరు ఎందుకు టైం కు రారు అంటే..ఇక్కడ ప్రభుత్వ జీతం తీసుకుంటూనే..ప్రవైట్ గా వీరు ఓ హాస్పటల్ పెట్టి అక్కడ ముందుగా పేషంట్లను చూసి..ఆ తర్వాత నిదానంగా ఇక్కడికి వస్తారు. ఓ గంట సేపు ఇక్కడ హడావిడి చేసి తిరిగి తమ సొంత హాస్పటల్ కు వెళ్లారు. ఇలా ప్రభుత్వ డాక్టర్లంతా ఇదే చేస్తున్నారు.

కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి , ఆయా మంత్రులు కాస్త సీరియస్ గా ఉండడం..ఎప్పటికప్పుడు ఉద్యోగుల టైమింగ్ ఫై అరా తీస్తుండడం తో కాస్త కరెక్ట్ టైం కు రాకపోయినా కాస్త ఆటో..ఇటో వచ్చేవారు.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కూడా ఏ ప్రభుత్వ అధికారి సరిగా పనిచేయడం లేదు టైం కు రావడం లేదు. ఇదేంటి అని ప్రశ్నిస్తే అంతే అన్నట్లు సమాధానం చెపుతున్నారు. రెవిన్యూ ఆఫీసులు , ప్రభుత్వ స్కూల్స్ , ప్రభుత్వ హాస్పటల్ లోనే కాదు రాష్ట్ర సచివాలయం లోను ఇదే పరిస్థితి. 9:30 కు రావాల్సిన అధికారులు 11 గంటలకు అది కూడా ఎలాంటి హడావిడి లేకుండా..ఇంకా టైం ఉందేలే అని మాదిరిగా వస్తున్నారు. ఇలా ఈ టైం కు వస్తే మా పనులు ఎప్పుడు అవుతాయి అని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్..ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు..వారి పని ఫై నిఘా పెట్టాలని కోరుతున్నారు.

Read Also : Ram Mandir: అయోధ్య రామ‌ మందిరంలో కొత్త అర్చకులు.. 2000 మందిలో కేవ‌లం 20 మంది మాత్రమే ఎంపిక‌..!