బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservation) అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల పలు రాజకీయ పార్టీలు , నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు , శ్రేణులైతే సీఎం రేవంత్ కు పాలాభిషేకాలు చేస్తూ..ప్రశంసిస్తున్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలకే కాదు, స్థానిక సంస్థలలో కూడా బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని తీర్మానించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఈ రిజర్వేషన్లను అమలులోకి తేవాలని నిర్ణయించింది. అయితే ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు అయ్యే అంశంపై న్యాయపరమైన సందేహాలు ఉన్నాయి.
Prabhu Deva – Nayanthara : ప్రభుదేవా – నయనతార విడిపోవడానికి కారణం అదేనా..ఆలస్యంగా బయటపడ్డ నిజం ?
భారత రాజ్యాంగం ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే ఆ పరిమితి నిండిన రాష్ట్రంలో అదనంగా రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చితే తప్ప ఈ రిజర్వేషన్లు నిలదొక్కుకోలేవన్న అభిప్రాయం న్యాయవాదుల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడంతో తెలంగాణలో రాజకీయంగా గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఇప్పటి వరకు బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. గతంలో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, అప్పట్లో సుప్రీంకోర్టుకు ప్రత్యేక హామీ ఇచ్చి సాధ్యమైంది. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో, కొత్తగా తీసుకువచ్చే ఆర్డినెన్స్ కోర్టులలో సవాల్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు ఇప్పటికే మూడు నెలల్లో రిజర్వేషన్ల కేటాయింపును ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల శాతం పెంపు అంశం స్థానిక సంస్థల ఎన్నికలను న్యాయపరమైన వివాదాల్లోకి నెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.