Site icon HashtagU Telugu

IRCTC: పెంపుడు జంతువులకి రైల్వే ఆన్లైన్ టికెట్

IRCTC

Whatsapp Image 2023 05 06 At 7.07.20 Pm

IRCTC: రైల్లో ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఉపశమనం కలిగించినట్లైంది.

పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేశారు. వాటికేదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్ళలేరు. ముఖ్యంగా రైలు ప్రయాణ సమయంలో అస్సలు కుదరదు. అటు వదిలి ఉండలేక, తమతో తీసుకెళ్లలేక సతమతమవుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రకటన చేయనుంది.

పెంపుడు కుక్కలు మరియు పిల్లుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రతిపాదనను సిద్ధం చేసింది. తమతో పాటు పెంపుడు జంతువుల కోసం ఇంట్లో ఉండే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇకపై IRCTCలో పెంపుడు జంతువులకు టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం యజమానులు తమ పెంపుడు జంతువుల కోసం రైళ్లలో 1వ తరగతి AC టిక్కెట్లు, క్యాబిన్‌లను బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే ప్లాట్‌ఫామ్‌లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లను సంప్రదించి టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది. ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. యజమానులకు, ఇతరులకు కాస్త ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పెంపుడు జంతువుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.

పెట్స్ మాత్రమే కాకుండా ఆవులు, గేదెలు, గుర్రాలు వంటి వాటిని గూడ్స్ రైళ్లలో మాత్రమే తీసుకెళ్లవచ్చు. అలాగే వాటిని చూసుకోవడానికి ఒక వ్యక్తి ఆ జంతువుల వెంట ఉండాల్సి ఉంటుంది.

Read More: Airtel Prepaid: ఎయిర్‌టెల్ 365 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు