Site icon HashtagU Telugu

Mens Day 2024 : నేడే మెన్స్ డే.. ఒక్క పురుషుడు.. ఎన్నో పాత్రలు

International Mens Day 2024

Mens Day 2024 : ఇవాళ (నవంబరు 19) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించేందుకు ఇది స్పెషల్ డే. మహిళలతో పోలిస్తే పురుషులకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆయా బాధ్యతల వల్ల తమపై ఉండే ఒత్తిడి గురించి పురుషులు ఓపెన్‌గా చెప్పుకోలేరు. ఈ ఒత్తిడి గురించి చెబితే.. ఇతరులు తమను తక్కువ చేసి చూస్తారనే ఆందోళన పురుషుల్లో అంతర్గతంగా ఉంటుంది. దీనివల్ల లోలోపల కుమిలిపోతూ పురుషులు తమ మానసిక ఆరోగ్యాన్ని చేతులారా దెబ్బతీసుకుంటారు. అందుకే కుటుంబంలోని మహిళల నుంచి పురుషులకు బలమైన నైతిక మద్దతు లభించాలి. సామాజిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాల ప్రభావంతో పురుషుల్లో చాలాసార్లు కోపం, చిరాకు, ఆందోళన అనేవి బయటికి కనిపిస్తుంటాయి. ‘పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్’(Mens Day 2024) అనేది 2024 సంవత్సరానికిగానూ ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ థీమ్.  పురుషుల మానసిక ఆరోగ్యం, వారికి మద్దతునిచ్చేలా సామాజిక పరిస్థితుల ఏర్పాటును సాధించడమే ఈ థీమ్ లక్ష్యం.

Also Read :Kondru Sanjay Murthy: భారత ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌‌’గా కొండ్రు సంజయ్‌మూర్తి.. ఎవరు ?

పురుషుడు నిత్యం తన కుటుంబం గురించి ఆలోచిస్తూ.. వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. నిత్యం శ్రమిస్తూ.. వారి కోసం కొవ్వొత్తిలా కరిగిపోతాడు. అయినా పురుషులు చేసే శ్రమకు సమాజంలో ఎక్కువగా గుర్తింపు ఉండదు. నాన్నగా, కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, భర్త గా ఎన్నో పాత్రలను పురుషుడు బ్యాలెన్స్‌డ్‌గా పోషించాల్సి ఉంటుంది. ఈక్రమంలో చాలామంది ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పుతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంటుంది. ఈవిధంగా జరగకూడదంటే.. పురుషులకు కుటుంబం వైపు నుంచి, సమాజం వైపు నుంచి కనీస నైతిక మద్దతు లభించాయి.

Also Read :Singareni : సింగరేణి మరో కొత్త వ్యాపారం.. కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ తయారీ

పురుషులకు కూడా ఒక ప్రత్యేక దినోత్సవం ఉండాలని 1960లలో కొంతమంది పోరాటాలు చేశారు. కొంతమంది జర్నలిస్టులు వారి రచనల ద్వారా ఆ పోరాటాన్ని  ముందుకు తీసుకెళ్లారు.ఈక్రమంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో 1999లో పురుషుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.