International Men’s Day 2022: మీ ప్రియమైన వారికి ఇవి బహుమతిగా ఇవ్వండి..సంతోషిస్తారు..!!

  • Written By:
  • Updated On - November 18, 2022 / 03:32 PM IST

ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు ఓ రోజుంది. అది ఈ శనివారం నవంబర్ 19. అవును . అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మహిళల కంటే పురుషులకు బహుమతులు ఇవ్వడం చాలా సులభం. కానీ కొన్నిసార్లు వారి ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఏం ఇవ్వాలో అర్థం కాదు. కాబట్టి ఈరోజు మనం అలాంటి కొన్ని గిఫ్టుల గురించి తెలుసుకుందాం.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రతిఏడాది నవంబర్ 19న జరుపుకుంటారు. పురుషులు, లింగసమానత్వం, ఆదర్శ పురుషుల గురించి ప్రపంచానికి తెలియచేయడం దీని లక్ష్యం. ఈ రోజు పురుషులు సమాజం, కుటుంబం, వివాహం, పిల్లల సంరక్షణలో ఎలా సహకరిస్తున్నారు. స్త్రీల అభ్యున్నతికి ఎలా పాటుపడుతున్నారు. వారి విజయాల గురించి చర్చిస్తారు. అయితే ఈ మెన్స్ డే కు మీ సోదరుడు, మీ తండ్రి లేదా భర్త లేదా స్నేహితుడికి కొన్ని బహుమతులు ఇచ్చిన సర్ ప్రైజ్ చేయండి. అయితే పురుషులకు ఎలాంటి బహుమతులు ఇస్తే సంతోషిస్తారో తెలుసుకుందాం.

1. గ్రూమింగ్ కిట్
గత కొన్నేళ్లుగా గడ్డం పెంచుకోవడం పురుషుల్లో బాగా ట్రెండింగ్ లో ఉంది. కాబట్టి మీరు మీకు నచ్చినవారికి ప్రత్యేకంగా గ్రూమింగ్ కిట్ గిఫ్టుగా ఇవ్వవచ్చు. వారు ఈ బహుమతిని కచ్చితంగా ఇష్టపడతారు.

2. పుస్తకాలు
పుస్తకాలకు మంచిన బహుమతి మరొకటిలేదు. మీ సోదరుడు కానీ భర్త కానీ స్నేహితుడు కానీ పుస్తకం చదివే అలవాటు ఉంటే వారి కోసం మంచి పుస్తకంగా బహుమతిగా ఇవ్వండి. ఈ రోజుల్లో ఇ బుక్స్ చాలా అందుబాటులో ఉన్నాయి.

3. ఫిట్ నెస్ గాడ్జెట్
మీ సోదరుడికి లేదా తండ్రికి కానీ భర్తకు ఏదైనా ఫిట్ నెస్ గాడ్జెట్ ను లేదా ఇతర ఫిట్ నెస్ సంబంధిత వస్తువులను గిఫ్టుగా ఇవ్వండి. వాటితో చాలా ఉపయోగం ఉంటుంది. యోగా మ్యాట్, రన్నింగ్ షూస్, స్కిప్పింగ్ రోప్ ఇలాంటివి ఇచ్చినట్లయితే వారు ఎంతో సంతోషిస్తారు.

4. కాఫీ మగ్.
ఇవే కాకుండా మొబైల్ కవర్, కాఫీ మగ్, లేదా టీషర్ట్ వంటివి కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. వాటిపై మీ ఇద్దరికి సంబంధించిన మరపురాని క్షణం గురించి ఫోటో మెసేజ్ కూడా రాయవచ్చు.

5. పర్సులు
ఇది చాలా సాదారణ బహుమతి. అయినప్పటికి చాలా మంది పురుషులకు వాలేట్ వాడుతుంటారు. కాబట్టి మంచి వాలేట్ ను బహుమతిగా ఇవ్వండి. మంచి బ్రాండ్, కలర్ వారికి కచ్చితంగా నచ్చుతుంది. దానిని వాడిన ప్రతిసారి మీరు గుర్తుకు వస్తారు.

6. సన్ గ్లాసెస్
ఎండు దుమ్ము ధూళి నుంచి కళ్లను రక్షించడమే కాకుండా ఎంతో స్టైల్ గా కూడా కనిపిస్తుంది. అబ్బాయిలకు యాక్సెసరీలలో సన్ గ్లాసెస్ కూడా ముఖ్యమైనవి. కాబట్టి వారికి సన్ గ్లాసెస్ గిఫ్టుగా అందిచండి.