Anti Corruption Day : అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం

మన పనులు త్వరగా చేయించుకోవాలని సాగే దందాకు మనం పెట్టుకున్న పేరు లంచం (Bribe), అవినీతి.

మన పనులు త్వరగా చేయించుకోవాలని సాగే దందాకు మనం పెట్టుకున్న పేరు లంచం (Bribe), అవినీతి (Corruption). ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని (Anti Corruption Day) జరుపుకుంటున్నాం. సమాజంలో కాస్తన్నా మార్పురావాలనే ఆలోచనతో జరుపుకునే రోజు ఇది. అవినీతి (Corruption) చిన్నగా మొదలై ఏడు తలల విషనాగులా మారిపోయింది. ఒక్క భారత దేశంలోనే అవినీతి పుట్టలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్నంత అవినీతి మరెక్కడా లేదు. అవినీతి అడ్రస్ రాజకీయాలే. ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. కనీస మౌలిక వసతులు కూడా ఇవ్వకుండా రోజు రోజుకూ బీదవారిగా మార్చేస్తుంది.

గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ దేశాల నుంచి విదేశాల వరకూ అన్ని చోట్లా అవినీతి పంజా విసురుతూనే ఉంది. అవినీతి వల్ల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. దీనితో నేరాలు పెరుగుతున్నాయి. ఉన్నవాడిని కొట్టి బీదవాడు బీదవాడిని కొట్టి ఇంకా బీదవాడు అవినీతిలో బ్రతుకుతున్నారు. బీదరికంలో ఉన్న దేశాలలో అవినీతి తక్కువగానే ఉంటుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలలోఅవినీతి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఒకప్పుడు లంచం తీసుకోవడాన్ని అడ్డుకునే జనం మొన్నటి ఎన్నికల్లో జనం ఏ పార్టీ ఎక్కువ ముట్టజెప్పుతుందో ఆ పార్టీకి మాత్రమే ఒటు వేస్తామని పబ్లిగ్గా ప్రకటించింది. మరి పార్టీలు కూడా గెలిచాకా ప్రజలకు కష్టపడి సంపాదించుకునే విధానాన్ని మార్చి ఉచితాలను ఇచ్చేస్తుంది. దీనితో ఉచితాలకు అలవాటు పడుతున్నారు జనం. ఇంతటి తెగింపుకు రావడానికి భారతదేశంలో పెరిగిపోతున్న అవినీతి మాత్రమే కారణం. ఒక ఉద్యోగం కొన్న ఉద్యోగి, లంచంతో పని జరిపించుకున్న సామాన్యడు ఇలా ప్రతి ఒక్కరూ తమ హక్కును కాలరాసి అవినీతి వైపు మొగ్గుచూపుతూనే ఉన్నారు. అదే హక్కుగా భావిస్తున్నారు.

Also Read:  Rashmi : మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసిన యాంకర్ రష్మీ