Marriages Spending : ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పెద్దసంఖ్యలో పెళ్లిళ్లతో మన దేశం హోరెత్తనుంది. ఆ రెండు నెలల వ్యవధిలో ఏకంగా 35 లక్షలకుపైగా మ్యారేజెస్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వీటి కోసం దాదాపు రూ.4.25 లక్షల కోట్ల దాకా ఖర్చు చేయనున్నారట. ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈవివరాలు వెల్లడయ్యాయి.
Also Read :Yahya Sinwar : యహ్యా సిన్వార్ చనిపోయాడా ? ఇజ్రాయెల్ వాదన ఏమిటి ?
ఇప్పటిదాకా పెళ్లి అంటే ఒక వేడుక. కానీ దాన్ని కూడా కొన్ని సంస్థలు ఒక వ్యాపారంలా మార్చుకున్నాయి. ఆయా సంస్థలు ఈ మ్యారేజ్ సీజన్‌ను తమ వ్యాపారాలకు అనువుగా మార్చుకోనున్నాయి. కాసుల వర్షాన్ని కురిపించుకోనున్నాయి. కుబేరులు, సెలబ్రిటీలు తమ మ్యారేజెస్‌ను స్పెషల్‌గా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం వాళ్లు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు. తమ ప్రతిష్ఠ, సంపదను అద్దంపట్టేలా ఏర్పాట్లు ఉండాలని శ్రీమంతుల కుటుంబాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో వాళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. మనదేశంలో 25 టూరిస్టు కేంద్రాలను(Marriages Spending) కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఎంపిక చేసింది. వీటిని పెళ్లిళ్లకు వేదికలుగా మార్చే దిశగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. దీంతోపాటు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మనదేశం నుంచి దుబాయ్, సింగపూర్, బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఫారిన్‌లో జరిగే మ్యారేజ్‌ల వల్ల మనదేశం ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతోంది. ఫారిన్‌లో పెళ్లి కోసం చేసే ఖర్చులో సగమైనా వెచ్చిస్తే.. మన దేశంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోతుంది. ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈవిషయాన్ని గ్రహించిన చాలామంది దేశంలోనే మ్యారేజ్‌లు నిర్వహించేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు.
Also Read :Rahul Gandhi : కశ్మీర్‌పై నాకున్న ప్రేమను మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు
పెళ్లి అంటే బట్టల షాపింగ్, నగల షాపింగ్, విలాసవంత వస్తువుల కొనుగోలు, వాచీల కొనుగోలు, అలంకరణ సామగ్రి కొనుగోలు, భోజనాల ఏర్పాట్లు, రవాణా ఏర్పాట్లు, కన్వెన్షన్ సెంటర్ల ఎంపికలు వంటివన్నీ జరుగుతాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగానే ఆదాయం చేరుతుంది. ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పెద్దసంఖ్యలో జరగనున్న మ్యారేజెస్ వల్ల కూడా దేశ ఖజానాకు మంచి ప్రయోజనం దక్కుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.