Site icon HashtagU Telugu

Tallest Escalator: దేశంలో అత్యంత పొడవైన ఎస్కలేటర్ ఎక్కడ ఉందో తెలుసా?

Tallest Escalator

Tllest Escalator

Tallest Escalator: షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ లో మనం రెగ్యులర్ గా మెట్లు చూసి ఉంటాము. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. షాపింగ్ మాళ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు ఇలా చాలా చోట్ల ఎస్కలేటర్లు వచ్చేశాయి. వయసు మళ్ళిన వారు, పేషేంట్స్ చక్కగా ఎస్కలేటర్ మీద నిలబడితే అదే గమ్యానికి చేరుస్తుంది. ఒకప్పుడు విదేశాల్లో కనిపించే ఈ టెక్నాలజీ ప్రస్తుతం భారతదేశంలో విస్తరించింది. దాదాపు అన్ని మహా నగరాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే దేశంలోనే అత్యంత పొడవైన ఎస్కలేటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతదేశం ముందు వరుసలో ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ పని సామర్ధ్యం టెక్నాలజీతోనే సాధ్యం. విదేశాల్లో కనిపించే ఎస్కలేటర్ ఇప్పడు దేశంలోని అన్ని మెట్రో సిటీలో అందుబాటులో ఉంది. ఎస్కలేటర్ ద్వారా శ్రమ లేకుండా నిమిషాల్లో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. షాపింగ్ మాల్ అయినా లేదా ఏదైనా బహుళ అంతస్తుల భవనం అయినా, ప్రతిచోటా ఎస్కలేటర్ల సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల ఎత్తులో ఉండటం వల్ల ఎస్కలేటర్ పొడవు కూడా ఎక్కువగానే ఉంటుంది.

భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎస్కలేటర్ రాజధాని ఢిల్లీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి వెస్ట్ మెట్రో స్టేషన్‌లో భారతదేశపు పొడవైన ఎస్కలేటర్ నిర్మించబడింది. జనక్‌పురి వెస్ట్ మెట్రో స్టేషన్‌లో నిర్మించిన ఈ ఎస్కలేటర్ ఎత్తు 15.6 మీటర్లు. దీని పొడవు 35.3 మీటర్లు. అధిక పొడవు కారణంగా ఈ ఎస్కలేటర్ ని జాయింట్ల ద్వారా నిర్మించారు. ఒక నివేదిక ప్రకారం ఈ ఎస్కలేటర్ ఎత్తు దాదాపు ఐదు అంతస్తుల భవనంతో సమానంగా ఉంటుంది. గతంలో కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్‌లో ఉన్న ఎస్కలేటర్ 14.5 మీటర్ల ఎత్తుతో అత్యంత ఎత్తైనదిగా పేరుగాంచింది.

Read More: World Special Village : ప్రపంచంలోనే వింత గ్రామం, ఇక్కడ ప్రజలు మాట్లాడేటప్పుడు, నడుస్తున్నప్పుడు నిద్రపోతారు.!!!