Richest Cricketer : మనదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరు ? అనగానే.. అందరూ సచిన్, కోహ్లి, ధోని, రోహిత్ శర్మ వైపు చూస్తారు. కానీ సంపదలో వీరిని మించిన రిచెస్ట్ క్రికెటర్ ఒకరు ఉన్నారు. ఆమె పేరే.. మృదుల జడేజా !! ఆమె ఓ యువరాణి. గుజరాత్‌లోని ప్రముఖ రాజ వంశం నుంచి క్రికెట్ ప్రపంచంలోకి మృదుల జడేజా అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె గుజరాత్‌లోని సౌరాష్ట్ర టీమ్ కెప్టెన్‌గా ఉన్నారు. సచిన్, కోహ్లి, ధోని, రోహిత్ శర్మ వంటివారు మ్యాచ్ ఫీజు, యాడ్స్, ఇతర బిజినెస్‌లతో డబ్బులు సంపాదించారు. కానీ మృదుల జడేజాది రాజవంశం కావడంతో.. ఆమెకు విలువైన వారసత్వ ఆస్తులు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
- మృదుల జడేజా ఆల్‌రౌండర్.
- ఆమె తండ్రి పేరు మంధాతసిన్హ్ జడేజా.
- తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి తమ చారిత్రాత్మక రంజిత్ విలాస్ ప్యాలెస్‌లో మృదుల జడేజా నివసిస్తుంటారు.
- రాజ్‌కోట్‌లో సుమారు 225 ఎకరాల్లో ఉన్న ఓ ఎస్టేట్‌లో ఈ భవనం ఉంది.
- మృదుల కుటుంబానికి చెందిన ప్యాలెస్‌లో 150కిపైగా గదులు ఉన్నాయి.
- మృదుల ఇంటి గ్యారేజ్‌లో ఎన్నో కాస్ట్లీ వింటేజీ కార్లు ఉన్నాయి.
- మృదుల కెరీర్‌ను చూస్తే.. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో 46 వన్డేలు, టీ20 ఫార్మాట్లో 36 మ్యాచ్‌లు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక మ్యాచ్ ఆడారు.
- మృదుల కుడిచేతి వాటం గల 32 ఏళ్ల బ్యాట్స్ ఉమెన్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా.
- గతంలో పురుష, మహిళా క్రికెటర్ల వేతనాలకు మధ్య వ్యత్యాసాలపై పోరాడిన వాళ్లలో మృదుల(Richest Cricketer) కూడా ఉన్నారు.