Site icon HashtagU Telugu

Indo-China : “హిందీ- చీనీ భాయ్ భాయ్” నుంచి “నువ్వా నేనా” అనే దాకా ఘర్షణలు, వివాదాల ప్రస్థానమిది!!

Indo China war tawang

Indo China

డిసెంబర్ 9న వివాదాస్పద హిమాలయ సరిహద్దులో భారత్, చైనా (Indo-china)దళాలు ఘర్షణ పడ్డాయి. ఇది దాదాపు గత రెండేళ్లలో దేశాల మధ్య జరిగిన మొదటి సంఘటనగా మారింది. భారతదేశం యొక్క ఈశాన్య భూభాగం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో డిసెంబర్9న జరిగిన ఈ ఘర్షణలో ఇరు పక్షాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు 2020 జూన్ లో ఇరుపక్షాల మధ్య అక్సాయ్ చిన్-లడఖ్‌లో ఘర్షణ(War) జరిగింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారాయి. ఈ నేపథ్యంలో చైనా, భారత్ మధ్య సరిహద్దు  వివాదంపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశీలనాత్మక విశ్లేషణ ఇదీ..

‘హిందీ చినీ .. భాయ్ భాయ్,’ గుర్తుందా?  ఈ నినాదాన్ని 1954లో దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇచ్చారు. శాంతియుత సహజీవనం కోసం చైనా,  భారతదేశం (Indo-china)ఐదు సూత్రాలను నిర్దేశించుకున్న  తర్వాత ఈ నినాదాన్ని నెహ్రూ ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత ఏడేళ్ల పాటు అంతా సవ్యంగానే నడిచింది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగాయి. కానీ 1962 అక్టోబర్ 20న అనుకోని ఒక ఘటన జరిగింది. భారత భూభాగం దురాక్రమణకు చైనా తెగబడింది.దీంతో ఆనాడు చైనా-ఇండియా యుద్ధం(war) మొదలైంది. సైనిక సన్నద్ధత చేసుకునే టైం ఇవ్వకుండా ఆనాడు చైనా దాడి చేసింది. దీంతోకేవలం దాదాపు 20,000 మంది భారత సైనికులు, 80,000 మంది చైనా సైనికుల మధ్య పోరాటం జరిగింది.దాదాపు నెల రోజుల పాటు వార్ సాగింది. చివరకు భారత్ విజ్ఞప్తి మేరకు చైనా కాల్పుల విరమణ ప్రకటించడంతో ఈ యుద్ధం నవంబర్ 21న ముగిసింది.

యుద్ధం ఎందుకు వచ్చింది ?

టిబెట్‌లో తన పాలనకు భారతదేశం ముప్పు అని చైనా భావించింది. చైనా-భారత్ యుద్ధం వెనుక ప్రధాన కారణాలలో ఇది ఒకటి.దీనివల్లే1962 అక్టోబర్ 20న యుద్ధానికి తెగబడింది. 1959 మార్చిలో టిబెట్ నుంచి పారిపోయిన దలైలామాకు భారత్‌ ఆశ్రయం ఇచ్చింది. ఈ పరిణామాన్ని చూసి అప్పట్లో చైనా అధ్యక్షుడిగా ఉన్న మావో జెడాంగ్ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారు. టిబెట్‌లో లాసా తిరుగుబాటుకు భారతీయులే కారణమని మావో అప్పట్లో వ్యాఖ్యానించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చివరకు 1962 అక్టోబర్ 20న యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత భారతదేశం తన సైన్యంపై దృష్టి సారించింది. విదేశీ, భద్రతా విధానాన్ని పునరాలోచించడం ప్రారంభించింది. ఫలితంగా భారత దేశ రక్షణ వ్యయం పెరిగింది.1967 సెప్టెంబరు-అక్టోబర్లో సరిహద్దు వెంబడి భారత సైనికులు ముళ్ల తీగలను ఏర్పాటు చేయడం ప్రారంభించిన తర్వాత నాథు లా, చో లాలో రెండు దేశాలు మళ్లీ ఘర్షణ పడ్డాయి. 1987 ఫిబ్రవరి 20న భారతదేశం అరుణాచల్ ప్రదేశ్‌కు రాష్ట్ర హోదాను మంజూరు చేసింది. ఈ నిర్ణయం చైనా కు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఆ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య వాగ్వివాదాలు జరిగాయి.  ఇటీవల కాలంలోనూ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌పై చైనా తన వాదనలను నొక్కి చెప్పింది. సరిహద్దు విషయమై
కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

చైనాకు తవాంగ్ ఎందుకు ముఖ్యం?

తవాంగ్ గాండెన్ నామ్‌గ్యాల్ లాట్సే ప్రపంచంలోని రెండవ అతిపెద్ద టిబెటన్ బౌద్ధ విహారం. ఇది ఐదవ దలైలామా కోరికలను నెరవేర్చడానికి 1680-81లో స్థాపించబడింది. ఈ మఠం జిల్లా ఒకప్పుడు టిబెట్‌కు చెందినదని రుజువుగా పనిచేస్తుందని చైనా పేర్కొంది. రాష్ట్రంపై తన వాదనకు మద్దతుగా, చైనా టిబెట్‌లోని లాసా మఠం మరియు తవాంగ్ మఠం మధ్య చారిత్రక సంబంధాలను ఉదహరించింది. అలాగే, 1959లో దలైలామా టిబెట్ నుండి పారిపోయినప్పుడు, తవాంగ్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించి, ఆశ్రమంలో కొంతకాలం గడిపారు.

తవాంగ్ భారత్‌లో అంతర్భాగమని చైనా ప్రభుత్వానికి భారత్ పదేపదే చెప్పింది. 2009లో ఇద్దరు ప్రధానులు థాయిలాండ్‌లో కలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని భారత్ పునరుద్ఘాటించింది. 2017 ఏప్రిల్లో తవాంగ్‌లో దలైలామా పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.

అరుణాచల్ ప్రదేశ్ లో హిందీ ప్రభావం..

మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ వాసులు ఇతర ఈశాన్య రాష్ట్రాల నివాసితుల కంటే హిందీలో మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది ఈ భాషను మాట్లాడగలరు. రాష్ట్ర శాసనసభలో చర్చల సమయంలో ఇతర భాషలలో హిందీని కూడా ఉపయోగిస్తారు. 2010లో ప్రఖ్యాత భాషా విమర్శకుడు GN దేవీ నిర్వహించిన తాజా భాషా సర్వే ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్ దాదాపు 90 స్థానిక భాషలకు నిలయంగా ఉంది. అయినప్పటికీ, అనేక స్థానిక భాషల కంటే ఉమ్మడి భాషగా హిందీకి రాష్ట్రం ప్రాధాన్యత ఇస్తుంది.  అరుణాచల్ ప్రదేశ్ 1962లో చైనా-ఇండియా సంఘర్షణకు కేంద్రబిందువుగా ఉంది. ఆ కాలంలో రాష్ట్రంలో భారత సైన్యం ఉండటంతో ఇక్కడ హిందీ భాష వాడుకలోకి వచ్చింది.

స్వాతంత్ర్యం కు ముందు..

ఇండియా, చైనా మధ్య 2,100 మైళ్ల పొడవు (3,379-కిలోమీటర్లు) వివాదాస్పద సరిహద్దు ఉంది. దీని విషయంలో ఇండియా, చైనా మధ్య చాలా కాలంగా ఘర్షణ నడుస్తోంది.
స్వాతంత్ర్యానికి ముందు నుండి కూడా ఈ వివాదాలు ఉన్నాయి. బ్రిటన్, టిబెట్ మరియు రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రతినిధులు బ్రిటీష్ ఇండియా మరియు చైనాల మధ్య సరిహద్దులను పరిష్కరించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నంలో 1914లో మెక్‌మాన్ లైన్ గీశారు. టిబెట్ మరియు బ్రిటిష్ ఇండియా సరిహద్దును అంగీకరించగా, చైనా మాత్రం దాన్ని అంగీకరించలేదు.భారతదేశం 1947లో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) స్థాపించబడింది. కొత్త చైనా ప్రభుత్వం కూడా మెక్‌మాన్ లైన్ చెల్లనిదిగా పరిగణించింది.
1950వ దశకంలో చైనా టిబెట్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే టిబెట్‌పై చైనాకు సార్వభౌమాధికారం లేదని భారతదేశం వాదిస్తోంది. అయితే 1962కి ముందు వరకు చైనాతో స్నేహం కోసం ఇండియా పాకులాడింది.

Also Read: Prabhas: సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్.. బాలయ్య, గోపీచంద్ తో అన్‌స్టాపబుల్ టాక్!!

HashtagUHindi