Air Force Day 2023 : ఇవాళ (అక్టోబర్ 8) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 91వ వార్షికోత్సవం. ఈ రోజు ప్రతి భారతీయ పౌరుడికి గర్వించదగిన రోజు. ఎందుకంటే భారత వైమానిక దళం అధికారికంగా 1932లో ఇదే రోజున ఏర్పాటైంది. అందుకే ఈ రోజును భారత వైమానిక దళం దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఏలుతున్నారు. 1932 అక్టోబర్ 8న బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు సహాయక బృందంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పడింది. 1933లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మొదటి స్క్వాడ్రన్ ను క్రియేట్ చేశారు. ఎయిర్ మార్షల్ సుబ్రతో ముఖర్జీని భారత వైమానిక దళ వ్యవస్థాపకుడిగా పరిగణిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత.. ఆయనే వైమానిక దళానికి మొదటి ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్ కు ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్.. ‘‘ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్’’!! ఈ సంవత్సరం భారత వైమానిక దళం ( IAF ) వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుపుకుంటున్నారు. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వైమానిక దళంలోని వీర సైనికులందరికీ ఈరోజు ఘన నివాళులు అర్పించారు. అంతేకాదు.. ఈరోజు నుంచి భారత ఎయిర్ ఫోర్స్ కు కొత్త జెండా అందుబాటులోకి రానుంది. 1951లో తీసుకొచ్చిన ఎయిర్ ఫోర్స్ పాత జెండాను సెంట్రల్ ఎయిర్ కమాండ్ మ్యూజియంలో భద్రంగా ఉంచుతారు. ఇంతకుముందు భారత నావికాదళం జెండాను కూడా కేంద్రంలోని మోడీ సర్కారు మార్చేసింది.
Also read : Capsicum Masala Rice : క్యాప్సికంతో ఇలా రైస్ ఎప్పుడైనా చేశారా ? చాలా టేస్టీగా ఉంటుంది
ఎన్నో ఘనతలు సొంతం..
- 1932 అక్టోబర్ 8 నుంచి 1950 వరకు మన ఎయిర్ ఫోర్స్ ను రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పిలిచేవారు.
- 1950లో దీనిపేరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా మారింది.
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్‌తో 1947-1948, 1965, 1971 (బంగ్లాదేశ్ యుద్ధం), 1999 (కార్గిల్ యుద్ధం) సమయాల్లో వీరోచితంగా పోరాడింది.
- 1961లో భారత యూనియన్‌లో గోవా చేరడంలో వాయుసేన పాత్ర కీలకం.
- 1962లో చైనాపై జరిగిన యుద్ధంలో భారత సాయుధ దళాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకమైన వైమానిక మద్దతును అందించింది.
- 1984లో సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఎయిర్ ఫోర్స్ ముఖ్య పాత్ర పోషించింది.
- 1988లో మాల్దీవులలో ప్రభుత్వాన్ని పడగొట్టకుండా పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలంను (Air Force Day 2023) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిరోధించింది.