Trending

India – Shortest Day : ఇవాళ ఇండియాలో పగలు చిన్నది.. రాత్రి పెద్దది.. ఎందుకు ?

India - Shortest Day : ఈరోజు మన ఇండియాకు చాలా స్పెషల్. ఎందుకంటే.. ఇవాళ పగటి పూట టైం త్వరగా ముగిసిపోతుంది..

Published By: HashtagU Telugu Desk
India Shortest Day

India Shortest Day

India – Shortest Day : ఈరోజు మన ఇండియాకు చాలా స్పెషల్. ఎందుకంటే.. ఇవాళ పగటి పూట టైం త్వరగా ముగిసిపోతుంది.. రాత్రిపూట టైం మాత్రం ఎక్కువ సేపు కొనసాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ పగలు చిన్నది, రాత్రి పెద్దది. ఇలాంటి స్థితిని శీతాకాలపు అయనాంతం (Winter Solstice) అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 లేదా 22న ఈ ఈవెంట్ సహజ సిద్ధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుని నుంచి దూరంగా వంగి ఉన్న కారణంగా ఈవిధంగా రాత్రి టైం స్లోగా గడుస్తుంది. ఇవాళ  భూమి తన అక్షం మీద 23.4 డిగ్రీల మేర వంగి ఉంటుంది. దీనివల్ల భూమి యొక్క ధ్రువంపైకి సూర్య కిరణాలు మునుపటి కంటే కాస్త ఆలస్యంగా పడతాయి. ఫలితంగా ఈరోజు రాత్రి ఎక్కువ టైం పాటు కొనసాగుతుంది.

ఎందుకిలా జరుగుతుంది ?

సాధారణంగా పగటి పూట సమయం 12 గంటలుగా ఉంటుంది. అయితే ఇవాళ మాత్రం పగలు 10 గంటల 40 నిమిషాలే ఉంటుంది. ఎందుకు అంటే.. ఖగోళ శస్త్రం మనకు ఆన్సర్ ఇస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. ఇలా తిరగడం వల్ల భూమిపై సీజన్లు మారుతుంటాయి.  ఏటా డిసెంబర్ 21 లేదా 22 తేదీల్లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరార్ధగోళంలో పగటి టైం తక్కువ, రాత్రి టైం ఎక్కువగా ఉంటుంది. మన ఇండియా భూమి ఉత్తరార్ధ గోళంలోనే ఉంది. దీంతో మన దేశంలో ఈరోజు రాత్రి టైం పెరిగి, పగటి టైం తగ్గుతుంది. ఇదే సమయంలో భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న భాగం వైపు వేసవి సీజన్ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో దీన్ని అతిపెద్ద రోజుగా పిలుస్తారు. దీని తర్వాత భూమి ఉత్తరార్ధగోళం వైపు కదులుతుంది. దీని కారణంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగటి టైం పెరిగి, రాత్రి టైం తగ్గడం మొదలవుతుంది. ఈ విధంగా ప్రతి ఏడాది డిసెంబర్‌ 21 లేదా డిసెంబర్‌ 22 తేదీల్లో(India – Shortest Day) జరుగుతుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ప్రతి సంవత్సరం శీతాకాలపు అయనాంతం రోజును.. శనిదేవుడు భూమిపైకి వచ్చిన దినోత్సవంగా పురాతన రోమన్లు జరుపుకునేవారు.
  • ఖగోళ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో పొడవైన పగటి రోజు జూన్ 20.
  • భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి సాధారణంగా 24 గంటల టైం పడుతుంది. ఆ సమయాన్ని మనం ఒక రోజుగా పరిగణిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో భూభ్రమణ వేగం పెరుగుతుంటుంది. ఇలా వేగం పెరిగితే 24 గంటల కాలంలో కొద్ది క్షణాలు టైం తగ్గిపోతుంది.
  • 2020 సంవత్సరం నుంచి భూభ్రమణ వేగం పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read: Gifts From Mithila : సీతమ్మ పుట్టినింటి నుంచి అయోధ్య రామయ్యకు కానుకలివీ..

  Last Updated: 22 Dec 2023, 09:08 AM IST
Exit mobile version