Site icon HashtagU Telugu

Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్

Increased Temperatures In Bhagyanagar.. Meteorological Department Alert

Increased Temperatures In Bhagyanagar.. Meteorological Department Alert

Temperatures Alert :మొన్న కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం భాగ్యనగరంలో ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం మండుటెండగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఎండ మరింత దంచి కొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.. ఈ వారం ముగిసేవరకు హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి, రెండు రోజుల్లో వాతావరణ శాఖ దీని గురించి ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండలు జనాలకు చెమట్లు పట్టిస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిక.

Also Read:  Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్