Site icon HashtagU Telugu

Zomato: మా కమీషన్‌ పెంచండి.. కొన్ని రెస్టారెంట్లకు జొమాటో మెసేజ్.. ఎందుకంటే?

Increase Our Commission.. Zomato Message To Some Restaurants.. Because

Increase Our Commission.. Zomato Message To Some Restaurants.. Because

జొమాటోకు నష్టాలు పెరుగు తున్నాయి.. లాభాలు తగ్గుతున్నాయి.. నేరుగా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినడం పెరగడంతో ఫుడ్‌ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ల సంఖ్య తగ్గిపోవడంతో ఇలా జరుగుతోంది. దీంతో జొమాటో (Zomato) అప్రమత్తమైంది. తగ్గిన ఆర్డర్‌ విలువలను తిరిగి పూడ్చు కోవడానికి.. రెస్టారెంట్ల మీద పడింది. తన కమీషన్లను 2-6% పెంచాలని చాలా రెస్టారెంట్‌లను డిమాండ్‌ చేసినట్లు సమాచారం. కమీషన్లు పెంచుకోవడానికి ముంబై, దిల్లీ, కోల్‌కతా సహా కొన్ని నగరాల్లో వివిధ రెస్టారెంట్ చైన్లను జొమాటో సంప్రదించినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా ఈ తంతు నడుస్తున్నట్లు పేరు చెప్పని ఒక రెస్టారెంట్‌ ఓనర్‌ వెల్లడించారు. కమీషన్‌ పెంపునకు అంగీకరించకపోతే, ఆ రెస్టారెంట్‌ను డెలివెరీ లిస్ట్‌ నుంచి తీసేయచ్చు, డెలివరీ చేయగల పరిధిని తగ్గించవచ్చు, లేదా రెస్టారెంట్‌ పేరును జొమాటో ప్లాట్‌ఫామ్‌లో చాలా కిందకు నెట్టేయవచ్చు. ఏదైనా జరగవచ్చని రెస్టారెంట్‌ ఓనర్‌ వాపోయారు.అయితే, ఇప్పడు ఇస్తున్న కమీషన్లే ఎక్కువగా ఉన్నాయని, ఇంకా పెంచితే భరించలేమంటూ చాలా రెస్టారెంట్ల ఆపరేటర్లు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

జొమాటోతో (Zomato) చర్చలు జరుపుతామన్న NRAI

గతంలోనూ కమీషన్ల వ్యవహారంలో ‘నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (NRAI) ఫిర్యాదుతో CCI (కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) వరకు కేసు వెళ్లింది.దాదాపు 50 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్న NRAI కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టింది. రెస్టారెంట్ మెంబర్ల తరపున జోమాటోతో తాము మాట్లాడతామని వెల్లడించింది. ఈ విషయం మీద ఒక జాతీయ మీడియా పంపిన ఈ-మెయిల్‌కు జొమాటో స్పందించింది. జొమాటోతో పాటు, జొమాటో రెస్టారెంట్‌ పార్టనర్లు కూడా పోటీపోటీగా, స్థిరంగా ఉండేలా తమ కమీషన్లను పునఃపరిశీలిస్తున్నట్లు చెప్పారు.

స్విగ్గి వర్సెస్ జొమాటో..

గత రెండు సంవత్సరాలుగా, రెస్టారెంట్ భాగస్వాములతో ఒప్పందాన్ని బట్టి, ఒక్కో ఆర్డర్‌ డెలివెరీ మీద 18-25% కమీషన్‌ను జొమాటో వసూలు చేస్తోంది. దీనినే మరో 2-6% మేర పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. జొమాటో కంటే ఎక్కువ కమీషన్‌ వసూలు చేస్తున్న స్విగ్గీతో (Swiggy) సమాన స్థాయిలో నిలిచేందుకు జొమాటో తహతహలాడుతోందని రెస్టారెంట్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.Swiggy యొక్క ఛార్జీలు సగటు ఆర్డర్ విలువ (AOV) ఆధారంగా ఒక ఆర్డర్‌కు 9%-22% మధ్య ఉంటాయి. అధిక AOV తక్కువ కమీషన్‌ను ఆకర్షిస్తుంది. ఆర్డర్ విలువను బట్టి ధరను నిర్ణయించే స్విగ్గి యొక్క నిర్మాణం Zomatoకి ప్రతికూలతను కలిగిస్తుందని సోర్స్ తెలిపింది. ప్రతి ఆర్డర్‌పై లాభం పెంచుకోవాలని జొమాటో కోరుకోవడం మంచిదే. కానీ, దాని వల్ల రెస్టారెంట్లు తీవ్రంగా నష్టపోతాయని ఫుడ్ టెక్ కంపెనీ ఘోస్ట్ కిచెన్స్ పౌండర్‌ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ తన్నా ఆరోపించారు. “అధిక కమీషన్ రేట్లను అంగీకరించకపోతే డెలివరీ రేడియస్ 3 కిలోమీటర్ల కంటే తక్కువకు తగ్గుతుందని జోమాటో చెబుతోంది. జోమాటో యాప్ లో విజిబిలిటీ విషయంలో రాజీ పడాల్సి వస్తుంది” అని మరో రెస్టారెంట్ ఓనర్ చెప్పారు.

Also Read:  Rajiv Jain: మునిగిపోతున్న అదానీ నౌకను నిలబెట్టిన రాజీవ్‌ జైన్‌ ఎవరు?