Site icon HashtagU Telugu

Musli Herb: తక్కువ పెట్టుబడి లక్షల్లో లాభం ఇచ్చే పంట గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

White Musli

White Musli

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత వ్యాధులను నయం చేయడానికి ఎక్కువగా సహజ ఉత్పత్తులపై ఆధారపడుతుండడంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది. భారతీయులు ఎక్కువగా ఇంటి చిట్కాలను ఉపయోగిస్తూ వైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అంతేకాకుండా ఈ తీవ్రమైన వ్యాధులను నివారించడం కోసం ఔషధ మొక్కల మార్కెటింగ్ కూడా వేగంగా విస్తరిస్తోంది. అలాగే మార్కెట్ లో కూడా ఈ ఔషధ మొక్కలతో తయారైన ఉత్పత్తులకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ ఔషధ మొక్కలను ప్రస్తుతం ఆయుర్వేద అలాగే పెద్ద ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అయితే ఇది అక్షరాల నిజం అనీ గుజరాత్ లోని దాంగ్ జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. గుజరాత్ లోని రైతులు అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే ఒక మూలికల పంటతో కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ లోని దాంగ్ జిల్లాలో రైతులు తెలుపు మస్లి మూలికల పంటలు పండిస్తున్నారు. దీనినే సఫేద్ మస్లి అని కూడా పిలుస్తుంటారు. వర్షాకాలంలో సాగు చేసే ఈ మూలికలతో అక్కడి రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. ఈ తెలుప మస్లీ సాగును పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో ఈ చేపట్టడంతో తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడినీ సాధిస్తున్నారు.

ఈ వైట్ మస్లీ మూలికలు అధిక బరువు తగ్గేందుకు, అంగ స్తంభన సమస్యలకు అలాగే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఈ వైట్ మస్లీకి ఇండియా తో పాటూ విదేశాల్లో కూడా బాగా డిమాండ్ ఉండటంతో మూలికలతో పాటు టానిక్ రూపంలో కూడా లభిస్తోంది. ప్రస్తుతం కేజీ వైట్ మస్లీ ధర రూ.1000 నుండి రూ.1500 ధర పలుకు తుండగా ప్రభుత్వ పథకాలను పొందడంతో సాగు ఖర్చు చాలా స్వల్పంగానే ఉంటోంది. అలాగే స్థానిక ఫార్మా కంపెనీల ప్రతినిధులు రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సాయం కూడా కలిసిరావడంతో ఈ పంట రైతుల ఇంట సిరుల పంట కురిపిస్తోంది.

Exit mobile version