Hanuman In Female Avatar : ఆ ఆలయంలో స్త్రీ రూపంలో ఆంజనేయుడు.. మహిమాన్విత గాథ తెలుసుకోండి

Hanuman In Female Avatar :  ఆ ఆంజనేయ ఆలయం ప్రపంచంలోనే వెరీవెరీ స్పెషల్..అక్కడ హనుమంతుడు స్త్రీమూర్తి రూపంలో భక్తుల పూజలు అందుకుంటున్నాడు..

  • Written By:
  • Updated On - August 30, 2023 / 12:00 PM IST

Hanuman In Female Avatar :  ఆ ఆంజనేయ ఆలయం ప్రపంచంలోనే వెరీవెరీ స్పెషల్..

అక్కడ హనుమంతుడు స్త్రీ రూపంలో భక్తుల పూజలు అందుకుంటున్నాడు..

తన కరుణతో అందరి కోరికలు తీరుస్తున్నాడు..

మనం ఈరోజు  ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రతన్ పూర్ జిల్లా గిర్జ్ బంద్ లో ఉన్న ఆంజనేయ ఆలయ విశేషాలు తెలుసుకోబోతున్నాం. 

Also read : No To G20 Vs Yes To China : ఇండియాకు నో .. చైనాకు యస్.. పుతిన్ కీలక నిర్ణయం

రతన్ పూర్ రాజు పృథ్వీ దేవ్ జు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఆయన  కుష్టు వ్యాధితో బాధపడుతుండే వారట. జీవితంపై ఆయన ఆసక్తిని కోల్పోయి, నైరాశ్యంలో మునిగిపోయారట. అటువంటి కష్టకాలంలో రాజు పృథ్వీ దేవ్ జు కలలో కనిపించిన  హనుమంతుడు.. తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. ఆ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు.. మరోసారి రాజు కలలో ఆంజనేయుడు కనిపించి మహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని సూచిస్తాడు. దీంతో హనుమంతుడి సూచనల ప్రకారం.. మరుసటి రోజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా ఒక హనుమాన్ విగ్రహం స్త్రీ రూపంలోరాజుకు దొరుకుతుంది. దాన్ని చూసిన రాజు పృథ్వీ దేవ్ జు ఆశ్చర్యపోతాడు. భగవంతుడు తనకిచ్చిన ఆదేశం మేరకే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయం లోపల ప్రతిష్ట చేస్తాడు. ఆ తర్వాత రాజును వెంటాడిన కుష్టు సమస్య వదిలి వెళ్లిపోతుంది. ఈవిధంగా ఆ ఆలయంలో స్త్రీరూపంలో ఆంజనేయుడు (Hanuman In Female Avatar)  పూజలు అందుకోవడం మొదలవుతుంది. రాముడు, సీతాదేవిలను హనుమంతుడు తన చెరో భుజంపై మోస్తున్న మరో విగ్రహం కూడా ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Also read : Boys Hostel: బాయ్స్ హాస్టల్ బంపర్ ఆఫర్, బై వన్ గెట్ వన్ టికెట్

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని బిలాస్ పూర్ కు నేరుగా క్యాబ్ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి రతన్ పూర్ కు 28 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి రతన్ పూర్ కు చేరుకోవడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం చాలా అనువైన టైం.