Three CMs – One Plan : ముగ్గురు కొత్త సీఎంలు.. ఒక పొలిటికల్ ప్లాన్

Three CMs - One Plan : బీజేపీ అధిష్టానం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌లలో సీఎంలుగా కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది.

  • Written By:
  • Updated On - December 13, 2023 / 08:35 PM IST

Three CMs – One Plan : బీజేపీ అధిష్టానం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌‌లలో సీఎంలుగా కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎందుకిలా చేశారు అనే ప్రశ్న ఉదయించింది. అద్వానీ సన్నిహితుడు, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు  మధ్యప్రదేశ్‌లో బీజేపీ పెద్దలు పక్కన పెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో అద్వానీ సన్నిహితులు, మాజీ సీఎం రమణ్ సింగ్‌కు కూడా ప్రయారిటీ దక్కలేదు. రాజస్థాన్‌లోనూ అద్వానీ కాలం నాటి మాజీ సీఎం వసుంధరా రాజేకు అవకాశం ఇవ్వలేదు. ఇదంతా దేనికి సంకేతం ? ఈ నిర్ణయాల వెనుక  ‘మోడీ’ ముద్ర కనిపిస్తోందా ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

రాజస్థాన్.. భజన్ లాల్ శర్మ

తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన భజన్ లాల్ శర్మను రాజస్థాన్ సీఎంగా బీజేపీ పెద్దలు డిసైడ్ చేశారు. ఈయన బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవారు. డిప్యూటీ సీఎంలుగా రాజ్‌‌పుత్, దళిత వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం ఇచ్చారు.ఈవిధంగా రాష్ట్రంలోని మూడు ముఖ్య వర్గాలకు పాలనలో అవకాశం కల్పించింది.  భజన్ లాల్ శర్మ ప్రధాని మోడీకి అత్యంత సన్నిహుతుడు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలంగా నమ్మే వ్యక్తి. హైకమాండ్‌తో విధేయంగా ఉన్న వ్యక్తి.  అందుకే ఆయనకు సీఎం సీటు ఈజీగా దక్కింది. గతంలో సీఎంగా పనిచేసిన వసుంధరా రాజే  ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో అంతగా పనిచేయలేకపోయారు. భజన్ లాల్ శర్మ ఆర్ఎస్ఎస్ విధానాలను ప్రభుత్వం ద్వారా అమలు చేయగలుగుతారని విశ్వసించబట్టే ఆయనకు సీఎంగా ఛాన్స్ ఇచ్చారని పరిశీలకులు(Three CMs – One Plan) అభిప్రాయపడుతున్నారు.

Also Read:Curry Leaves Juice Tips : కరివేపాకు జ్యూస్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

మధ్యప్రదేశ్.. మోహన్ యాదవ్

మధ్యప్రదేశ్‌లో ఓబీసీ వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌‌కు సీఎంగా అవకాశం దక్కింది. బ్రాహ్మిణ్, ఎస్‌సీ వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను డిప్యూటీ సీఎంలుగా చేశారు.  మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్.. ఓ సారి మంత్రిగానూ పని చేశారు. అనుభవం పరంగా చూసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ కన్నా తక్కువే. అయినా వచ్చే  లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీ వర్గం వారిని ఆకర్షించే లక్ష్యంతో మోహన్ యాదవ్‌‌కు బీజేపీ పెద్దలు అవకాశమిచ్చారు. ఆర్ఎస్ఎస్‌లోనూ నిబద్ధతతో పనిచేసిన నేపథ్యం మోహన్‌కు  ఉంది.

ఛత్తీస్‌గఢ్.. విష్ణుదేవ్ సాయ్

ఛత్తీస్‌గఢ్‌ సీఎం అయిన విష్ణు దేవ్ సాయ్‌కి ప్రధాని మోడీతో సాన్నిహిత్యం ఉంది. ఆయన ప్రధాని మోడీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈసారి రాష్ట్రంలోని 29 గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 17 చోట్ల బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారంలో విష్ణుదేవ్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలోని గిరిజన జనాభాను బీజేపీ వైపు ఆకర్షించే లక్ష్యంతో విష్ణు దేవ్‌కు సీఎంగా ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. మాజీ  సీఎం రమణ్ సింగ్‌కు ఉన్న తిరుగులేని సీనియారిటీ ప్రాధాన్యత ఇవ్వలేదు. బహుశా వయసు పరమైన కారణంతో ఆయనకు నో చెప్పి ఉండొచ్చని భావిస్తున్నారు. పై మూడు రాష్ట్రాల కొత్త సీఎంలు కూడా గతంలో అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దుపై పెద్ద ఎత్తున ప్రచారం చేసినవారే కావడం గమనార్హం. ఇలాంటి వ్యక్తులకు తమ పార్టీలో కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలిస్తూ బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.